Lavanya Tripati: సినీ నటి లావణ్య త్రిపాఠి ఉత్తరాది అమ్మాయి అనే సంగతి తెలిసిందే. ఇలా నార్త్ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకొని ఏకంగా టాలీవుడ్ హీరోనే పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అడుగుపెట్టారు.
ఇలా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలియడంతో గతంలో లావణ్య గురించి అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఒక సినిమా ఈవెంట్లో ఈమె తెలుగు స్పష్టంగా మాట్లాడటంతో వెంటనే అరవింద మైక్ తీసుకుని తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నావు ఇక్కడే ఒక తెలుగు అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకో అంటూ ఈయన కామెంట్ చేశారు.
ఈయన చెప్పిన విధంగానే ఈమె మెగా హీరోని ప్రేమించి మెగా ఇంటికి కోడలుగా వెళ్లారు అప్పట్లో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. ఇక ఇదే విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మా నాన్నకు ముందు చూపు ఎక్కువ అంటూ పోస్ట్ చేశారు. ఇక ఈ విషయం గురించి లావణ్య త్రిపాటికి ఇటీవల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు లావణ్య ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.
ముందు చూపు ఎక్కువే…
అల్లు అరవింద్ గారికి చాలా విజినరీ ఉంది. కానీ ఎవరికి తెలియని విషయాలు కూడా ఆయనకు ఎలా తెలిసాయి అనేది నాకైతే అర్థం కాలేదు అంటూ ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి అల్లు అరవింద్ వీరి ప్రేమ గురించి గతంలో చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…