Lavanya Tripati: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి లావణ్య త్రిపాఠి ఒకరు. ఈమె అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినటువంటి ఈమె అనంతరం పలు తెలుగు సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.
ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి లావణ్య త్రిపాఠి గత ఐదు సంవత్సరాల నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారు. అయితే వీరి ప్రేమ విషయాన్ని తమ పెద్దలకు తెలియజేసి నవంబర్ ఒకటవ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరి వివాహం తర్వాత వీరిద్దరూ కూడా తమ పనులలో బిజీ అయ్యారు. ఈ విధంగా లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత మొదటిసారి తన సోషల్ మీడియా ఖాతాలో తన పేరును మార్చారు.
ఇంస్టాగ్రామ్ లో ఇప్పటివరకు లావణ్య త్రిపాఠిగా ఉన్నటువంటి ఈమె ఇప్పుడు తన పేరు పక్కన కొణిదెల పేరును జత చేసి లావణ్య త్రిపాటి కొణదెల అని పెట్టారు. అయితే ఇది కేవలం ఇంస్టాగ్రామ్ లో మాత్రమే అప్డేట్ చేశారని ట్విట్టర్ ఫేస్ బుక్ లో మాత్రం లావణ్య త్రిపాఠి అని ఉంది అక్కడ మాత్రం ఈమె తన పేరును అప్డేట్ చేయలేదు అయితే ఇన్స్టాగ్రామ్ లో ఈమె లావణ్య త్రిపాఠి కొణిదేలగా మారడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లావణ్య త్రిపాఠి కొణిదెల…
మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టిన తర్వాత లావణ్య త్రిపాఠి కొణిదెల పేరును పక్కన జత చేసుకోవడంతో మెగా అభిమానులు ఈమె ఇంస్టాగ్రామ్ పేజ్ మరింత వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఉపాసన కూడా తన పేరు పక్కన కొణిదెల పేరును జత చేసిన సంగతి మనకు తెలిసిందే. అదే బాటలోనే లావణ్య కూడా తన పేరు పక్కన తన ఇంటిపేరును జత చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…