Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ సీజన్లో విన్నర్ గా నిలిచినటువంటి ఈయన పోలీసులు వద్దని చెప్పిన భారీ స్థాయిలో ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు ఈయనపై కేసు నమోదు చేశారు. అయితే ఈయన అభిమానులు సెలబ్రిటీల కార్లపై అదే విధంగా ఆర్టిసి బస్సులపై రాళ్ల దాడి చేయడంతో సుమారు ఆరు బస్సుల అద్దాలు పగిలిపోయాయి. దీంతో ప్రభుత్వ ఆస్తిని నష్టం చేసినందుకుగాను ఈయనపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
ఇలా పల్లవి ప్రశాంత్ ఆయన సోదరుడు మనోహర్ పై కేసు నమోదు కావడంతో వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. అయితే లాయర్ సూచనల మేరకు ఇంటికి రావడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన స్వగ్రామానికి వెళ్లి పల్లవి ప్రశాంత్ ఆయన సోదరుడు మనోహర్ ను కూడా కస్టడీలోకి తీసుకున్నారు..
ఇలా ప్రశాంత్ తో పాటు తన సోదరుడుని పోలీసులు అరెస్టు చేసి అనంతరం ఆరు గంటలపాటు వీరిని విచారించి జడ్జి ఇంటిలోనే ఆయన ముందు హాజరు పరిచారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు A1 ముద్దాయిగా ప్రశాంత్ పేరు నమోదు చేయగా A2 గా తన సోదరుడు మనోహర్ పై కేసు నమోదు చేశారు. అయితే లాయర్ వాదన విన్న తర్వాత జడ్జ్ వీరికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో వీరిద్దరిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
హద్దులు దాటిన అభిమానం…
14 రోజుల తర్వాత తిరిగి విచారణ జరుపనున్నారు ఇలా పల్లవి ప్రశాంత్ ను ప్రస్తుతం జైలులో వేయడంతో కొందరు ఈ విషయంపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అభిమానం ఉండాలి కానీ ఆ అభిమానం ఇలా మనల్ని ఇబ్బందులలో పడేసేలా ఉండకూడదని అభిమానులను అలా ప్రవర్తించేలా రెచ్చగొట్టకూడదు అంటూ ఈయన వ్యవహార శైలిపై కామెంట్స్ చేస్తున్నారు. వీరితోపాటు వీరు ర్యాలీ కోసం వెళ్లినటువంటి కారు డ్రైవర్ల పై కూడా కేసులు నమోదయాయని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…