Leena manimekalai : హిందువులను కించపరిచేలా సినిమా చిత్రికరణ చేసారంటూ ఇప్పటికే హిందూ సంఘాలు రచ్చచేస్తుంటే, దానిని మరింత రెచ్చగొట్టేలా ఈరోజు మరో ఫోటో పెట్టి అగ్గికి ఆజ్యం పోసింది లీనా. భారత సంతతికి చెందిన కెనడాకు చెందిన నిర్మాత, డైరెక్టర్ అయిన లీనా మణిమేఖలై కాళికా దేవి పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. ఈ పోస్టర్ లో కాళికా దేవి వేషధారణలో ఉన్న వ్యక్తి సిగరెట్ తాగుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది దాంతో హిందువుల నుండి అభ్యంతరం వ్యక్తమైంది.

ఇక ఈ ఇష్యూ నే ఇంకా చల్లారలేదు అనుకుంటే మళ్ళీ నేడు శివపార్వతులు వేషధారణలో ఉన్న వ్యక్తి సిగరెట్ తాగే ఫోటోను షేర్ చేసి ఇది ఎక్కడో అంటూ కాప్షన్ ఇచ్చింది. దీంతో మరోసారి ఆందోళనలు చేసేవారిని ఇంకా రెచ్చగొట్టినట్లయింది. ఇక ఇప్పటికే లీనా పై అక్కడక్కడ కేసులు నమోదయ్యాయి. నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో లీనా మరోసారి ఇలా పోస్టర్ రిలీజ్ చేయడంతో వివాదం ఇంకొంచం ముదిరింది. లీనా తాను జీవించి ఉన్నంత వరకు నిర్భయంగా తన గొంతు వినిపిస్తానని చెప్తోంది. ఇక ఈవివాదం ముదిరి ఎక్కడి దాకా వెళ్తుందో.

Elsewhere…. pic.twitter.com/NGYFETMehj
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022
లీనా ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసిన కాళికా పోస్టర్ చట్టపరమైన డిమాండ్ కు వ్యతిరేకంగా ఉంది అని లీనా ఆ డాక్యుమెంటరీ లోని కాళికా పోస్టర్ ను డిలీట్ చేసింది. అలా డిలీట్ చేయడం వల్ల తాను కోల్పోయేది ఏం లేదు అంటూ పోస్ట్ పెట్టింది. ఇంకా తాను బ్రతికున్నంత వరకు నిర్భయంగా తను నమ్మినదానిని చెబుతానని, అందుకోసం తన ప్రాణాన్ని కూడా లెక్కచేయనని తమిళంలో ట్వీట్ చేసింది. ఆ పోస్టర్ వెనుక కథ తెలియాలంటే తాను తీస్తున్న డాక్యుమెంటరీ చూసి తెలుసుకోవాలని చెప్తోంది లీనా.



























