కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినా థర్డ్ వేవ్ రూపంలో మరోసారి పంజా విసిరెందుకు ఈ మహమ్మారి చూస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తగిన ఆంక్షలతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాల జారీచేసింది. ఈ నేపధ్యంలో మేరకు ఈనెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అయితే గత సడలింపులు, ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంటూ అదనపు సడలింపులను ప్రకటించారు.

ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలు ఈనెల 19వ తేదీ ఉదయం 6 గంటలతో ముగియనున్నాయి. ఈ నేపధ్యంలో ఆ తరువాత నుంచి ఈనెల 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ కిందివాటిపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. వివాహాలకు 50 మంది, అంతిమ సంస్కారాలకు 20 మందికి మాత్రమే అనుమతి తెలిపారు.



























