అధిక శరీర బరువుతో బాధపడేవారు వారి శరీర బరువును నియంత్రించడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే మన శరీర బరువును తగ్గించుకోవడానికి నిత్యం మనం వంటలలో ఉపయోగించే ఈ సుగంధ ద్రవ్యాలలో ఒక్కటైనా అల్లం కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. అల్లం కేవలం వంట గురించి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అల్లంలో ఆకలిని అణిచివేసే లక్షణాలు ఉన్నాయి కనుక అల్లం తీసుకోవడం వల్ల మన శరీర బరువును తగ్గించుకోవచ్చు.
అల్లంలో అధిక భాగం షోగోల్స్, జింజెరాల్స్ అనే పదార్థాలుంటాయి. అల్లం మనం వివిధ రకాల ఆహార పదార్ధాలు వేసుకొని తినడం ద్వారా ఇవి మన శరీర ప్రక్రియలను నియంత్రిస్తాయి.అదేవిధంగా అల్లంలో అధికభాగం యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇవి మన శరీరంలో ఏర్పడిన ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపించడం లో దోహదపడతాయి. అల్లం ఎక్కువగా తినే వారిలో ఆకలి తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలలో పరిశోధకులు వెల్లడించారు. శరీర బరువు తగ్గాలనుకునేవారు అల్లం ఈ టిప్స్ పాటించడం వల్ల తొందరగా శరీర బరువు తగ్గుతారు..
*మనం సాధారణంగా నిమ్మరసంతో జ్యూస్ తాగుతూ ఉంటాము. అయితే నిమ్మరసం లోకి కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగడం వల్ల మనకు ఆకలిని అణచివేస్తుంది.
*అల్లం టీ తయారు చేసుకొని తాగేటప్పుడు అందులోకి కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల మనకు ఆకలి పూర్తిగా నియంత్రిస్తుంది. ఈ విధంగా రోజులో నాలుగైదుసార్లు అల్లం టీ తాగటం వల్ల శరీర బరువు తగ్గుతారు.
*శరీర బరువు తగ్గాలని భావించేవారు ఆపిల్ సైడర్ వెనిగర్ లో అల్లం రసం కలుపుకోవాలి. లేదా అల్లం టీ లోకి ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకొని తాగడం ద్వారా శరీర బరువును తగ్గవచ్చు.
*సాధారణంగా గ్రీన్ టీ తాగడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం తెలిసిందే.అయితే ఈ గ్రీన్ టీ లోకి కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగడం వల్ల మనలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మొత్తం కలిగించి శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఈ విధంగా అల్లంతో వివిధ రకాల పానీయాలను తయారు చేసుకొని తాగడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…