సాధారణంగా ఇద్దరూ ప్రేమించుకున్నారంటే వారి పెళ్లికి అంగీకరించడానికి పెద్దలు ఒప్పుకోరు. ఈ విధంగా పెద్దలు ఒప్పుకోని నేపథ్యంలో ఆ జంట ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం లేదా తమ తల్లిదండ్రులకు చెడ్డపేరు రాకూడదనే భావనతో వారిరువురు కలిసి ఉండలేక చనిపోవాలనే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎంతోమంది తమ జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్నారు.
తాజాగా గుంటూరు జిల్లాలోని ఉండ్రాళ్ల మండలం యల్లాయపాలెంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అయితే ఈ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు సౌమ్య అనే యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో పెద్దవారికి చెప్పడంతో వీరి ప్రేమకు పెద్దలు అనుమతిచ్చారు. ఈ క్రమంలోనే తమ ప్రేమ పండిందని త్వరలోనే వారిద్దరూ ఒక్కటి కాబోతున్నారని ఆ జంట ఎంతో సంబరపడింది.
అయితే వారి ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. శ్రీకాంత్ అనే యువకుడు ఓ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ డెకరేషన్ కోసం వెళ్ళాడు. ఎలక్ట్రిక్ డెకరేషన్ చేస్తున్న క్రమంలో శ్రీకాంత్ కరెంట్ షాక్ తగిలి మరణించాడు.తాను ప్రేమించిన వ్యక్తి జీవితాంతం తనకు తోడుగా ఉంటానన్న వ్యక్తి ఇలా అర్ధాంతరంగా చనిపోయాడని తెలియడంతో ప్రియురాలు సౌమ్య ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది.
ఈ క్రమంలోనే శ్రీకాంత్ లేని జీవితం తనకు అవసరం లేదని విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది.ఈవిధంగా ఆత్మహత్యకు పాల్పడిన సౌమ్య ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే సౌమ్య ప్రాణాలను కోల్పోయింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమకు గుర్తుగా వీరిద్దరి శవాలు ఒకేచోట ఖననం చేశారు. ఈ విధంగా ప్రేమజంట ఒకేసారి చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…