అతడు ఆటో డ్రైవర్. పాఠశాలకు కొంతమంది విద్యార్థులను అక్కడ చేరవేసి..తన పని తాను చూసుకునేవాడు. అతడికి ఒక భార్య తో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అందులో ఉన్న ఒక విద్యార్థినితో అతడు ప్రేమలో పడ్డాడు. చివరకు ఓ బస్సులో విగతజీవులై పడి ఉన్నారు. అసలేమైందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో చోటు చేసుకుంది. చంద్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామానిని చెందిన 28 ఏళ్ల జగ్గారావు ఆటో నడపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు సర్వీస్ చేసుకుంటూ.. సంపాదించుకునే వాడు.
జగ్గారావు ఆటోలో చంద్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థినులు వెళ్లే వారు. అందులో 14 ఏళ్ల మయార అనూషతో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఓ రోజు ఆమె పాఠశాలలో బ్యాగ్ వదిలేసి.. అతడితో బయటకు వచ్చేసింది. అక్కడ నుంచి అశ్వారావుపేటకు వచ్చారు. కొత్తగూడెం డిపోకు చెందిన ఓ బస్సులో వాళ్లిద్దరు ఎక్కారు.
అంతకముందే వాళ్లు పురుగుల మందుతాగి.. ఆ బస్సులోనే వాంతులు చేసుకొని విగతజీవులకుగా పడిఉన్నారు. గమనించిన డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు.. అక్కడ నుంచి వాళ్లను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వాళ్లిద్దరూ అక్కడే మరణించారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…