పేటీఎం వివిధ రకాలు ఆఫర్లతో ముందుకు వస్తోంది. అందులో భాగంగానే గ్యాస్ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. గ్యాస్ ధరలు పెరుగుతున్న వేళ ఇది మంచి ఊరటనిచ్చే అశం అని చెప్పవచ్చు. రూ.900 క్యాష్ బ్యాక్ ను గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నందుకు కల్పిస్తోంది పేటీఎం.
వరుసగా మూడు నెలలు రూ.900 చొప్పున క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. మొత్తం రూ.2700 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఆ ఆఫర్ పేరు ‘3 పే 2700 క్యాష్‌బ్యాక్ ఆఫర్’ . ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ యూజర్లు ఈ ఆఫర్ పొందొచ్చు. పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా కూడా పేటీఎం నుంచి గ్యాస్ సిలిండర్ ను బుక్ చేయవచ్చు.
తర్వాత నెల ఆ డబ్బులను పే చేసుకునే వీలుంటుంది. ఇలా పోస్ట్ పెయిడ్ ద్వారా చేసుకున్న వాళ్లకు ప్రతీ బుకింగ్‌పై 5000 క్యాష్‌బ్యాక్ పాయింట్స్, రివార్డ్ పొందొచ్చు. వీటిని ప్రముఖ బ్రాండ్స్ అందించే అద్భుతమైన డీల్స్, గిఫ్ట్ వోచర్స్‌కు రీడీమ్ చేయొచ్చు. గ్యాస్ సిలిండర్ ను ఎలా బుక్ చేయాలంటే.. పేటీఎం యాప్ ఓపెన్ చేయగానే హోమ్ పేజీలో Book Gas Cylinder ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
తర్వాత గ్యాస్ ఎజెన్సీలో రిజస్టర్ అయిన మొబైల్ నంబర్ ను లేదా ఎల్‌పీజీ ఐడీ ను లేదా కన్స్యూమర్ నంబర్ ను ఎంటర్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే మీ వివరాలు కన్పిస్తాయి. వివరాలను సరిచూసుకొని బుకింగ్ పై క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే.. బుకింగ్ అయిపోయినట్లే.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…