M.S. Vikram : తెలుగులో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు ఎంఎస్ నారాయణ. ఆయన నటించిన అనేక సినిమాల్లో పండించిన హాస్యానికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 750 సినిమాల్లో నటించిన ఎంఎస్ గారు ‘పెద్ధరాయుడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన కొడుకు విక్రమ్ నారాయణ కూడా సినిమాల మీద ఆసక్తితో సినిమాల్లోకి వచ్చి చేసిన మొదటి సినిమా ‘కొడుకు’. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయారు. ఇక తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమ గురించి అలాగే తనకు సినిమాల మీద ఉన్న ఆసక్తి గురించి మాట్లాడారు.

మా నాన్న మొండివాడు.. హీరో అవ్వను అని ఎంతచెప్పినా వినలేదు…
హీరోగా కొడుకు సినిమా ద్వారా వచ్చిన విక్రమ్ మొదట హీరోగా సినిమా చేయాలని అనుకోలేదని చెప్పారు. కేవలం తన తండ్రి మొండి పట్టుదలవల్ల హీరోగా చేశానని చెప్పారు. మొదట ఎంఎస్ నారాయణ గారి డైరెక్షన్ లో కొడుకు హీరోగా సినిమా తీశారు. అయితే ఆ సినిమాలో హీరోగా చేయనని విక్రమ్ ఎంత చెప్పినా వినలేదట. కానీ ఎంఎస్ గారు నాకు నా కొడుకును హీరోగా చూడాలనుకుంటున్నాను అని చెప్పి తీశారట. ఇక మొదటి సినిమాకే గుండు కూడా కొట్టించారు. మొదటిసారికే ఎవరైన అలా చేస్తారా కానీ ఆయన మొండి పట్టుదల అలా చేయించారు అంటూ విక్రమ్ చెప్పారు.

అయితే విక్రమ్ కి మాత్రం మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలని అనుకునేవారట కానీ హీరోగా సినిమా చేయడంతో ఆ అవకాశాలు పోయాయని చెప్పారు. కానీ మా నాన్న కోరిక నెరవేర్చాను ఆది చాలు అనిపిస్తుంది అంటూ చెప్పారు. ఇండస్ట్రీలో ఉండాలంటే లక్ ఫ్యాక్టర్ ఉండాలి. సినిమా ఇండస్ట్రీ బిజినెస్ అంతా ఈరోజు ఎవరు మార్కెట్ లో ఉంటారో రేపు ఎవరు ఉంటారో ఎవరికీ తెలియదు అంటూ విక్రమ్ ఆయన అభిప్రాయాలను చెప్పారు.




























