M.S. Vikram : తెలుగులో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు ఎంఎస్ నారాయణ. ఆయన నటించిన అనేక సినిమాల్లో పండించిన హాస్యానికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 750 సినిమాల్లో నటించిన ఎంఎస్ గారు పెద్ధరాయుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన కొడుకు విక్రమ్ నారాయణ కూడా సినిమాల మీద ఆసక్తి తో సినిమాల్లోకి వచ్చి ‘కొడుకు’ సినిమాతో హీరోయిన్ అయ్యారు. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడం తో హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయారు. ఇక తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమ గురించి అలాగే తనకు సినిమాల మీద ఉన్న ఆసక్తి గురించి మాట్లాడారు.

పెద్ద స్టార్ కుటుంబం పిల్లల పరిస్థితే అలా ఉంది…
అన్నీ ఉండి ఒక హీరో చేయాలని అనుకుంటే హీరోలు అయిపోరు. అలా అయితే రాఘవేంద్రావు గారి అబ్బాయి హీరో అయిపోవాలి కదా అంటూ విక్రమ్ మాట్లాడారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నెపో కిడ్స్ సమస్యలను మాట్లాడారు. దాసరి నారాయణ రావు గారి అబ్బాయి ఎంత బాగా ఉంటాడు, కొన్ని హిట్స్ కుడా వచ్చాయి కదా అయినా హీరోగా నిలదొక్కుకున్నాడా, దాసరి గారి వల్ల ఎంతో మంది ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.

దాసరి గారు మాకు గురువు అంటూ మాట్లాడుతారు మరి వాళ్ళల్లో ఒక్కరైనా ఆయన కొడుకును పట్టించుకున్నారా, అలాంటివి ఇండస్ట్రీలో జరగవు. అవకాశాలు, అదృష్టం రెండూ ఉంటేనే ఇండస్ట్రీలో ఉంటాము. బ్రహ్మానందం గారి అబ్బాయి గౌతమ్, నేను ఇలా మేము వాళ్ళ కొడుకులు కాకుండా బయటి వాళ్ళమైయ్యుంటే మా పరిస్థితి వేరేలా ఉండేది. మా అవకాశాలు విభిన్నంగా ఉండేవి. కానీ మా పైన మహా వృక్షం ఉండటం వల్ల దాని నీడన మేము ఎదగాలేకపోయాము అంటూ చెప్పారు.































