Movie News

అంకుల్.. మా ఫ్యామిలీ జోలికి రాకండి.. నాగబాబుపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!

‘మా’ ఎలక్షన్స్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో మెగాబ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ ను సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. నాగబాబు మా సభ్యులతో సమావేశం అయి మంచు విష్ణుపై కొన్ని కామెంట్లు చేశారు.

వాటిపై విష్ణు స్పందించారు. దానికి సంబంధించి ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. తాను పోటీ చేస్తున్నట్లు తెలవగానే అవతలి సైడ్ నుంచి పోటీ చేసే అభ్యర్థి తనపై తీవ్రంగా స్పందించడని.. తన ఫ్యామిలీ జోలికి కూడా వచ్చాడన్నారు. అతడి(ప్రకాశ్ రాజ్ ) తో పాటు ఇతర నటులు అందులో సీనియర్ నటి కూడా తనను విమర్శలు చేశారని వాపోయారు. వారు చేసిన వ్యాఖ్యలకు తాను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చాడు.

అధ్యక్షుడిగా నిలబెట్టిన వారిలో ఒకరు ఈ విమర్శలు చేస్తున్నారని.. నాగబాబు పేరు చెప్పారు. అంకుల్ నేనేంటో మీకు తెలసుకదా.. మీ కళ్ల ముందు పెరిగిన వాడిని.. తమ సంస్థలో కూడా మీరు పనిచేశారు. ఎనిమిది నెలల క్రితం ప్రస్తుతం అసోసియేషన్ లో ఉన్న ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ ను నోటికొచ్చినట్లు మాట్లాడారు.

దానికి మీరు ఆయన్ను తిడుతూ.. మీ స్టైల్ లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం అతడు మీకు మేధావి.. మంచి వ్యక్తి అయిపోయారా.. అంటూ అన్నారు విష్ణు. తన గురించి మాట్లాడండి.. కానీ నాన్నగారిని సంబోధించకండి అంటూ చురకులు అంటించారు. దయచేసి మా ఫ్యామిలీ జోలికి రాకండి అంటూ పరోక్షంగానే విమర్శించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago