మా ఎన్నికలు సినీ పరిశ్రమలో కాకరేపుతున్నాయి. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. అయితే, తాజాగా మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రకాశ్ రాజ్ ను మోహన్ బాబుతో పోల్చాలి అని.. కానీ విష్ణుతో కాదన్నారు. పిల్లలందరికీ ఏం కావాలో మోహన్ బాబు కు తెలుసని.. సినీ పరిశ్రమలో ఏం కావాలో ప్రకాశ్ రాజ్ కు తెలుసున్నారు.
దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్ అని.. ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవన్నారు. నిర్మాతలతో వివాదం ప్రకాశ్ రాజ్ కే కాదు మోహన్ బాబు కుటుంబానికి కూడా ఉన్నాయని విమర్శించారు నాగబాబు. విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావు.. ఎక్కడ చదువుకున్నావు అని ప్రశ్నించారు నాగబాబు.
మంచు విష్ణు మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు అని కామెంట్ చేసిన మెగా బ్రదర్.. ప్రకాశ్ రాజ్, విష్ణు తెలుగు పరీక్ష రాస్తే విష్ణుకు పాస్ మార్కులు కూడా రావు అంటూ సంచలన విమర్శలు చేశారు.ప్రకాశ్ రాజ్ ని తెలుగోడంటారు, విష్ణును తెలుగు నేర్చుకొమ్మంటారని కామెంట్ చేసిన ఆయన.. సినిమా జ్ఞానం, ప్రపంచజ్ఞానం ఉన్న ప్రకాశ్ రాజ్ కే నా మద్దతు అంటూ మరోసారి స్పష్టం చేశారు.
విష్ణు జీవితంలో పాతిక సినిమాల్లో నటించడా.. కానీ ప్రకాశ్ రాజ్ తన కెరీర్ లో ప్రతీ సంవత్సరం పాతిక సినిమాలు చేశారన్నారు. ఓ తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడికి మనిషి లక్షణాలు లేవు … జంతు లక్షణాలు .. వాడొక యానిమల్ .. అంటూ కోట శ్రీనివాసరావు పై కొణిదెల నాగబాబు చేసిన విమర్శ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇలా విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ నాగబాబు దూకుడు పెంచాడు. ఇదిలా ఉండగా కోట శ్రీనివాసరావు అంతక ముందు ప్రకాశ్ రాజ్ పై విమర్శలు చేశారు. ఏనాడు షూటింగ్ కు టైంకు రాడని ఆరోపించాడు. దీంతో నాగబాబు పై విధంగా స్పందిచారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్‌కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…