Maadhavi Latha: సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న మాధవి లతా ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని చెప్పాలి. ఈమెకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె రాజకీయాలలోకి వెళ్లారు. అయితే కొంతకాలం పాటు రాజకీయాలలో కొనసాగిన ప్రస్తుతం రాజకీయాలకు కూడా దూరమయ్యారు.
ఇలా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇకపోతే సోషల్ మీడియా వేదికగా పెళ్లి గురించి చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలను తరచూ పెళ్లి గురించి అడగడం సర్వసాధారణమైన విషయమే.
ఈ క్రమంలోని ఈమెకు కూడా తరచూ పెళ్లి ప్రశ్న ఎదురవుతుందని ఈ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇలా తన పెళ్లి గురించి తరచూ ప్రస్తావనకు రావడంతో ఈమె పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మాధవి లత పెళ్లి గురించి స్పందిస్తూ పెళ్లి చేసుకోవాలి అంటే కేవలం వయసు ఒక్కటే ఉంటే సరిపోదని తెలియజేశారు.
పెళ్లి చేసుకోవాలంటే వయసుతోపాటు ఆ అమ్మాయి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతమైతే నేను మానసికంగా శారీరకంగా పెళ్లికి సిద్ధంగా లేనని అలాగే భవిష్యత్తుపై కూడా నాకు ఏమాత్రం నమ్మకం లేదని అందుకే తాను పెళ్లికి సిద్ధంగా లేనని ఇది కేవలం నా నిర్ణయం మాత్రమే అంటూ ఈమె పెళ్లి గురించి చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…