Featured

రెడ్డోళ్లు లక్ష్మారెడ్డికి మద్దతుగా ర్యాలీ చేస్తే ఏం చేస్తారు? హేమంత్ కులోన్మాద హత్య‌పై మాధవీలత షాకింగ్ కామెంట్స్ !

హీరోయిన్ మాధవీలత సినిమా పరంగానే కాక రాజకీయ, సామాజిక అంశాలతో కూడా పాపులర్ అవుతోంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మాధవీ లత క్యాస్టింగ్ కౌచ్‌పై గళం వినిపించి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అనంతరం బిజెపి పార్టీలో కూడా చేరింది. తాజాగా మాధవీలత హేమంత్ హత్య కేసు పై స్పందించి మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళ్తే.. హేమంత్, అవంతి ప్రేమ కథ విషాదాంతం అయ్యింది. అల్లారు ముద్దుగా పెంచిన కన్న కూతురిని.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపం.. అమ్మాయి కుటుంబాన్ని జీర్ణించుకోలేకుండా చేసింది. కొన్ని రోజులుగా వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసింది. కూతురు కూడా ఆ అబ్బాయికే సపోర్ట్ చేయటం, మమ్మల్ని కాదని వెళ్లిపోయిందనే కోపం వాళ్ళని రాక్షసులుగా మార్చేసింది. అంతే.. అల్లుడిని అంతం చేయాలని.. అప్పుడే మా అమ్మాయి మా దగ్గరకు వస్తుంది భావించారు. ఎలాగైనా అల్లుడు హేమంత్ ను చంపేయాలని ప్లాన్ వేశారు అవంతి పేరంట్స్. ఆ ప్లాన్ కు అమ్మాయి మేనమామ సాయం తీసుకున్నారు. అతని ద్వారా సుపారీ గ్యాంగ్ ను మాట్లాడుకున్నారు.

ప్లాన్ సిద్ధమైన తర్వాత.. హేమంత్, అవంతిలతో మాటలు కలిపారు. కూర్చుని పరిష్కరించుకుందాం.. ఒక్కదవుదామని నమ్మించారు. అవంతి పేరంట్స్ మాటలను నమ్మిన హేమంత్.. వాళ్లతో కలిసి కారు ఎక్కాడు. కారులోకి ఎక్కిన తర్వాత హేమంత్ – అవంతిలకు అనుమానం వచ్చి వెంటనే తప్పించుకోవటానికి ప్రయత్నించారు. అవంతి కారు దూకి పారిపోయింది. అదే కారులో హేమంత్ ను సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివార్లలోకి తీసుకెళ్లారు. అక్కడ హేమంత్ ను ఉరేసి చంపారు. ఆ తర్వాత డెడ్ బాడీని చెట్ల పొదల్లో పడేశారు. పోలీసులకు విషయం తెలిసి ఘటనా స్థలానికి వెళ్లేసరికి అంతా అయిపోయింది. సంగారెడ్డి క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుంది. అమ్మాయి తల్లిదండ్రులతోపాటు 9 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

అయితే తాజాగా ఈ సంఘటనపై స్పందించిన నటి మాధవీ లతా.. “రెడ్డోళ్లు లక్ష్మారెడ్డికి మద్దతుగా ర్యాలీ చేస్తే ఏం చేస్తారు?” అంటూ వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు. లేటెస్ట్ గా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘అమ్మాయి తన కులం వాడినే ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపిన వాళ్ళుంటే చూపించండి నాకు.. కులం పరువు, హోదా, డబ్బు, దర్పం మనుషులుగా మరణించిన మృగాలు. ఈ భూమి మీద ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం మేజర్ అయ్యాక ఎవరి హక్కులు వాళ్లవే.. ఔను కొడుకు ప్రేమ పెళ్లి చేసుకుంటే పరువుకి ఏం కాదు.. కాని కూతురు మాత్రం పరువు ఎందుకు అవుతుంది.? ఆడపిల్ల ఏమైనా ఆస్థినా? ఛీ.. ఏం మనుషులు వీళ్ళు.. అమ్మ నాన్న ప్రేమ గొప్పదే.. అది ఎవరు తక్కువ చేసేది కాదు.. కానీ తనకి నచ్చిన వాడిని చేసుకుంటే చంపే హక్కు ఎవ్వరికీ లేదు. ఇలా పగలు, ప్రతీకారాలు పెంచుకుంటూ పోతే ఇంకెందుకు ఈ చట్టాలు.. ఈ న్యాయం.. కోర్ట్ పద్ధతులు, సిద్ధాంతాలు. ఎవడికి నచ్చినట్లు వాడు రాసుకుంటే తగలబెట్టండి రాజ్యాంగాన్ని?? ప్రేమ పెళ్లి తప్పేమీ కాదు.. ఈరోజుల్లో పెద్దలు చూసిన అన్ని సంబంధాలు చక్కగా లేవు. అన్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి.

మన అమ్మ నాన్నల బంధం కూడా బిడ్డలా కోసమే. 70% అమ్మల బాధ బిడ్డల కోసమే.. భర్త కోసం కాదు.. అంతా సర్వమంగళ మేళం సంబంధాలే. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే అమ్మ నాన్న మనసుకి గాయమవుతుంది. గాయం చేయకూడదు.. ఒకవేళ చేస్తే గాయం చేసిన వాళ్ళని చంపడం మనుష్య నీతినా? జంతువులు కూడా ఇలా చంపవు. కులం, డబ్బు, స్టేటస్ అంటూ దళితుడిని‌ చేసుకుందనే కోపంతో అమృత భర్త ప్రణయ్‌ను చంపించాడు ఆర్యవైశ్యుడు మారుతీరావు. ఇప్పుడు ఆర్య వైశ్యుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో అవంతి భర్త హేమంత్‌ ను చంపించాడు రెడ్డి కులస్థుడు లక్ష్మారెడ్డి. మారుతీరావుకు మద్దతుగా ర్యాలీలు తీసినోళ్లు, సోషల్ మీడియాలో అమృతను దూషిస్తూ రెచ్చిపోయిన సైకోలు, కల్నల్ సంతోష్ బాబు మావోడే అని క్యాండిల్ ర్యాలీలు తీశారు కోమటోళ్లు. ఇప్పుడు రెడ్డోళ్లు అంతా లక్ష్మారెడ్డికి మద్దతుగా ర్యాలీలు తీస్తే ఏం చేస్తారు.?’ అంటూ కులరక్కసిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది నటి మాధవీలత. ఇప్పటికీ ఈ కులపిచ్చి ఏంటో అర్థం కావడం లేదని.. ఇండియాలో పుట్టడం వల్ల తనకు ఒక కులం ఉంది కాని.. కులపిచ్చిలేదని, తన పేరెంట్స్ ఎప్పుడూ తనకు ఈ కులపిచ్చిని నేర్పించలేదని, అన్ని కులాలతో కలిసే ఉంటున్నానని ఈ సందర్భంగా తెలియజేసింది మాధవీలత.

ఇదిలా ఉండగా హేమంత్ హత్య కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు లేటెస్ట్ గా ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను మీడియా ముందు తెలియజేసారు. అవేమిటంటే.. హేమంత్, అవంతిలకు పరిచయం ఏర్పడకముందే వారిద్దరి తల్లులు క్లోజ్ ఫ్రెండ్స్. హేమంత్ తల్లి రాణి, అవంతి తల్లి అర్చన ఇద్దరూ ఎంతో క్లోజ్ గా ఉండేవారు. అవంతి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా హేమంత్ తల్లి రాణి బ్యూటీషియన్ గా వెళ్లేంది. ఈ నేపథ్యంలోనే హేమంత్ తల్లితో అవంతి దగ్గరైంది. ఆ తర్వాత హేమంత్ తో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. హేమంత్, అవంతిలు ప్రేమ వివాహం చేసుకోకముందు, ఇద్దరి కుటుంబ సభ్యులు ఒకరి ఇంట్లో శుభకార్యాలకు మరొకరు వెళ్లేవారు. అయితే అవంతి, హేమంత్ ల ప్రేమ వ్యవహారం 2 కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. హేమంత్, అవంతిని తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకోవడాన్ని అవంతి కుటుంబసభ్యులు భరించలేకపోయారు. ఈ కారణంగానే హేమంత్ ను చంపేశారని పోలీసులు తెలియజేశారు.

telugudesk

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

4 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

4 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

4 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

4 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

4 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

4 hours ago