Mahaboob: వాలెంటైన్స్ డే ని పురస్కరించుకొని ఎంతోమంది వారిలో ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఇతరులకు ప్రపోజ్ చేశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెహబూబ్ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న బిబి జోడి కార్యక్రమంలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన శ్రీ సత్యతో కలిసి జోడి కట్టారు. ఇక వీరిద్దరి డాన్స్ పెర్ఫార్మెన్స్ డాన్స్ చేసే సమయంలో వీరి కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉందంటూ వీరి డాన్స్ పెర్ఫార్మెన్స్ పై జడ్జెస్ సైతం ప్రశంసలు కురిపించారు.ఇకపోతే వాలెంటైన్స్ డే ని పురస్కరించుకొని మెహబూబ్ శ్రీ సత్య దగ్గరకు వెళ్లి రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ బొకే ఇచ్చి తనకు ప్రపోజ్ చేశారు.
ఈ విధంగా మహబూబ్ ప్రపోజ్ చేయడంతో ఒక్కసారిగా శ్రీ సత్య షాక్ అయ్యి తన ప్రపోజల్ ను రిజెక్ట్ చేసింది.నీలాంటి క్వాలిటీస్ అందమైన అమ్మాయిని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను అని మెహబూబ్ చెప్పినప్పటికీ శ్రీ సత్య ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో పెంట అయ్యింది మరి ఇప్పుడు కూడానా అంటూ తన ప్రపోజల్ రిజెక్ట్ చేసింది.
ఇక మెహబూబ్ మాత్రం తన ప్రపోజల్ ఒప్పుకోకపోతే తాను చెయ్యి కట్ చేసుకుని సూసైడ్ చేసుకుంటానంటూ బ్లాక్మెయిల్ చేశారు. దీంతో శ్రీ సత్య తాను ఇప్పటికే తన లైఫ్ లో ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశాను ఎంగేజ్మెంట్ తర్వాత తన లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఎవరికీ ఇవ్వకూడదని, మనుషులపై తనకు నమ్మకం పోయింది అంటూ ఈ సందర్భంగా శ్రీ సత్య మెహబూబ్ పై ఫైర్ అవ్వడంతో చివరికి మెహబూబ్ ఇది ఫ్రాంక్ అంటూ అందరికి షాక్ ఇచ్చారు. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…