Sreeja: శ్రీజ కొణిదెల నిత్యం తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మెగా డాటర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె తన ప్రేమ పెళ్లి విడాకులు గురించి తరచు వార్తలలో నిలుస్తూ ఉన్నారు.శ్రీజ ఇదివరకు ఒక వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తనతో విడాకులు తీసుకొని రెండో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న శ్రీజ అనంతరం మరొక బిడ్డకు జన్మనిచ్చారు. అయితే గత కొంతకాలంగా శ్రీజ కళ్యాణ్ దేవ్ ఇద్దరూ కూడా దూరంగా ఉంటున్నారు.ఇలా వీరిద్దరూ దూరంగా ఉండడంతో విడాకులు తీసుకున్నారని అందరూ భావించారు. అయితే వీరు విడాకులు తీసుకున్నారని కానీ ఈ విషయాన్ని ఎక్కడ అధికారకంగా ప్రకటించలేదని తెలుస్తోంది.
ఇక సోషల్ మీడియా వేదికగా వీరు చేసే పోస్టులు కనుక చూస్తే వీరు తప్పనిసరిగా విడిపోయారని అర్థమవుతుంది ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రేమ గురించి చేసినటువంటి పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.కళ్యాణ్ దేవ్ వాలంటైన్స్ డే పురస్కరించుకొని ఇతరులు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారనేది ముఖ్యం కాదు వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేదే ముఖ్యం అంటూ ఈయన పోస్ట్ చేశారు.
ఇక శ్రీజ సైతం సోషల్ మీడియా వేదికగా ప్రేమ గురించి పోస్ట్ చేస్తూ ప్రేమ అంటే నీతో ప్రేమలో పడేసుకోవడం కాదు తనతో తానే ప్రేమలో పడేలా చేసుకోవాలి. ఉన్న ప్రేమను గుర్తించాలి… ప్రేమ కోసం ఎక్కడో వెతక్కూడదు అంటూ ఆమె ప్రేమ గురించి చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో అసలు వీరిద్దరూ ఇలా దూరంగా ఉండడానికి వీరి మధ్య ఈ గ్యాప్ ఏర్పడడానికి గల కారణం ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు. వీరు మాత్రం ఈ విషయంపై అస్సలు స్పందించడం లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…