Venkatesh: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికి ఎన్నో నిర్మాణ సంస్థలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఇక అప్పట్లో ఇండస్ట్రీలో రామానాయుడు గారు నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నేర్పించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఈయన తరువాత సురేష్ బాబు ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇకపోతే ఓ నిర్మాత కుమారుడిగా సురేష్ బాబు నిర్మాతగా మారగా వెంకటేష్ మాత్రం హీరోగా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.ఈ విధంగా వెంకటేష్ హీరోగా మాత్రమే మనకు తెలుసు కానీ ఆయన కూడా నిర్మాతగా ఒక సినిమా చేశారనే విషయం చాలా మందికి తెలియదు.
వెంకటేష్ కు సీనియర్ నటుడు నటభూషణ్ శోభన్ బాబు అంటే అమితమైన ప్రేమ ఇష్టం. ఈ క్రమంలోనే వెంకటేష్ వెంకటేష్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి శోభన్ బాబు వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా ఎంకి – నాయుడు బావ అనే సినిమాని నిర్మించారు.
ఇలా ఈ సినిమా నిర్మించే సమయంలో వెంకటేష్ వయసు 18 సంవత్సరాలు మాత్రమే.ప్రస్తుతం ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది..రామా నాయుడు సమర్పణలో వచ్చిన ఈ ఫిలిం సినిమా స్కోప్ – ఈస్ట్‌మన్ కలర్‌లో రూపొందించారు. గుమ్మడి, కాంతారావు, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి వారు నటించారు.
ఈ సినిమాకు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా తరువాత వెంకటేష్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోయారు. అక్కడే ఉన్నత చదువులు చదువుతూ నటనలో శిక్షణ తీసుకున్న అనంతరం కలియుగ పాండవులు సినిమా ద్వారా హీరోగా ఈయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన తరువాత వెంకటేష్ ఎలాంటి సినిమాలను నిర్మించలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…