Featured

Mahesh Babu: సర్కారు వారి పాట సినిమా కోసం కసరత్తులతో చెమటోడ్చిన మహేష్..!

Mahesh Babu: సర్కారు వారి పాట సినిమా గురువారం విడుదలయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా గురించి రివ్యూ ఇస్తూ చాలా మంది మహేష్ బాబు వన్ మ్యాన్ షో సినిమా గా చెప్తున్నారు. మహేష్ యాక్షన్ సన్నివేశాల్లోనూ, కామెడీ టైమింగ్ లోనూ అదరగొట్టాడు. ఇక డాన్సులు ఈ సినిమాలో కొత్తగా ఉండటం, మా మా మహేశా పాటలో మాస్ స్టెప్పులతో ఆదరగొట్టాడు. సినిమా కాన్సెప్ట్ బాగున్నా దర్శకుడు సరిగా చిత్రాన్ని తీసుకెళ్లలేదనే టాక్ వినిపించింది.

మొత్తానికి మిశ్రమ స్పందనతో సినిమా రన్ అవుతోంది. ఇక రానున్న రోజుల్లో తెలుగులో పెద్ద చిత్రాలేవి విడుదల కాకపోవడంతో కొత్త చిత్రాలకు బాగా గ్యాప్ ఉండటంతో లాంగ్ రన్ కలెక్షన్స్ సర్కారు వారి పాట సినిమాకు కలసి వస్తాయని విశ్లేషిస్తున్నారు. ఇక సినిమాపై టాక్ వసూళ్లు పక్కన పెడితే సినిమాలో మహేష్ వయసు తగ్గి యంగ్ కుర్రాడిలా అందరిని ఆకట్టుకున్నాడు. ఇక సినిమాలో కూడా అపుడే పెళ్ళివయసు ఎక్కడోచ్చిందండి అనే డైలాగ్ లో ఈ పొగడ్తల వల్ల బాగా గ్లామర్ కాపాడుకోడానికి కష్టపడాల్సి వస్తోంది అంటూ మహేష్ చెప్పే డైలాగ్ నిజమే అనిపిస్తోంది.

కసరత్తులతో కష్టపడుతున్న సూపర్ స్టార్….

ఇక తన ఫిట్ నెస్ కోసం మహేష్ ఎంతలా కస్టపడుతున్నాడో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా తెలిస్తోంది. జిమ్ లో ఎక్సర్సైజులు చేస్తూ మహేష్ సర్కారువారి పాట సినిమా లుక్ కోసం కష్టపడ్డారు. రాత్రుళ్ళు కూడా కసరత్తులు చేయడం మనం చూడొచ్చు. మహేష్ ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన మినాష్ ఈ వీడియోని షేర్ చేశాడు. గంటల కొద్ది ఎక్సర్సైజులు చేస్తున్న వీడియో షేర్ చేసి గత రెండేళ్లుగా ఈ చిత్రం కోసం తెరవెనుక ఏమి జరిగిందో అందరికీ తెలియజేయడానికి నేను ఈ సమయం తీసుకుంటున్నాను. కోవిడ్‌ ఆంక్షల కారణంగా సినిమా విడుదల చాలా కాలం వాయిదా పడింది .

అయితే సర్కారు వారి పాట సినిమాని ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని మహేష్ చాలా కష్టపడ్డారు . ఓవర్ టైం షూటింగ్, అర్ధరాత్రి కూడా వర్కౌట్లు చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరి కోసం తన లైఫ్ పెట్టి పనిచేసారు మహేష్. ‘సర్కారు వారి పాట’ విడుదల సందర్భంగా ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను” అంటూ మినాష్ ట్వీట్ చేశారు. ఇపుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago