Featured

Sonali Chauhan: వెంకటేష్ అలా ఉంటారని అస్సలు అనుకోలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య హీరోయిన్..!

Sonali Chauhan: బాలయ్య బాబుతో లెజెండ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాలి చౌహన్. ఇక పోతినేని రామ్ తో జోడికట్టి మెరిపించింది. ఆ తరువాత టాలీవుడ్ లో సినిమాలు తగ్గించిన సోనాలి మళ్ళీ f3 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన f3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. F2 సినిమాకు సీక్వేల్ గా వస్తోన్న ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరిన్ పిర్జాడా నటించారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో సోనాలి నటిస్తోంది. F2 సినిమాలో సోనాలి పాత్ర లేదు అయితే f3 కథలో భాగంగా సోనాలి కీలక పాత్రలో నటిస్తోంది.

వెంకటేష్ ని అలా అస్సలు అనుకోలేదు…

మే 27 న విడుదల అవుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది చిత్ర యూనిట్. అందులో భాగంగా సోనాలి చౌహన్ కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ ల గురించి ఆసక్తికర వాఖ్యలు చేసింది. వెంకటేశ్‌, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలతో పని చేయడం ఎలా అనిపించింది అని ప్రశ్న అడుగగా అందుకు సోనాల్ చౌహాన్‌, వెంకటేశ్‌గారు గొప్ప నటుడే కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా.

షూటింగ్ సెట్స్‌లో అందరితో కలిసిపోయి సరదాగా మాట్లాడతారు. కో స్టార్స్ ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేస్తారు. అసలు వెంకటేష్ అలా సరదాగా ఫ్రెండ్లీ గా ఉంటారని అస్సలు అనుకోలేదు. ఆయన దగ్గరి నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇక వరుణ్ తేజ్ చాలా పాజిటివ్‌గా ఉంటాడు . వరుణ్ తో కలిసి వర్క్ చేయడం కూడా ఆనందాన్ని ఇచ్చింది అంటూ తన కో స్టార్స్ గురించి ప్రశంసించింది సోనాలి. ఇక f3 సినిమాలో మరో సర్ ప్రైజ్ పూజ హెగ్డే ఐటమ్ సాంగ్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago