Sonali Chauhan: బాలయ్య బాబుతో లెజెండ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాలి చౌహన్. ఇక పోతినేని రామ్ తో జోడికట్టి మెరిపించింది. ఆ తరువాత టాలీవుడ్ లో సినిమాలు తగ్గించిన సోనాలి మళ్ళీ f3 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన f3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. F2 సినిమాకు సీక్వేల్ గా వస్తోన్న ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరిన్ పిర్జాడా నటించారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో సోనాలి నటిస్తోంది. F2 సినిమాలో సోనాలి పాత్ర లేదు అయితే f3 కథలో భాగంగా సోనాలి కీలక పాత్రలో నటిస్తోంది.

వెంకటేష్ ని అలా అస్సలు అనుకోలేదు…

మే 27 న విడుదల అవుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది చిత్ర యూనిట్. అందులో భాగంగా సోనాలి చౌహన్ కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ ల గురించి ఆసక్తికర వాఖ్యలు చేసింది. వెంకటేశ్, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలతో పని చేయడం ఎలా అనిపించింది అని ప్రశ్న అడుగగా అందుకు సోనాల్ చౌహాన్, వెంకటేశ్‌గారు గొప్ప నటుడే కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా.
షూటింగ్ సెట్స్‌లో అందరితో కలిసిపోయి సరదాగా మాట్లాడతారు. కో స్టార్స్ ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేస్తారు. అసలు వెంకటేష్ అలా సరదాగా ఫ్రెండ్లీ గా ఉంటారని అస్సలు అనుకోలేదు. ఆయన దగ్గరి నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇక వరుణ్ తేజ్ చాలా పాజిటివ్‌గా ఉంటాడు . వరుణ్ తో కలిసి వర్క్ చేయడం కూడా ఆనందాన్ని ఇచ్చింది అంటూ తన కో స్టార్స్ గురించి ప్రశంసించింది సోనాలి. ఇక f3 సినిమాలో మరో సర్ ప్రైజ్ పూజ హెగ్డే ఐటమ్ సాంగ్.


































