Mahesh Babu: సర్కారు వారి పాట సినిమా గురువారం విడుదలయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా గురించి రివ్యూ ఇస్తూ చాలా మంది మహేష్ బాబు వన్ మ్యాన్ షో సినిమా గా చెప్తున్నారు. మహేష్ యాక్షన్ సన్నివేశాల్లోనూ, కామెడీ టైమింగ్ లోనూ అదరగొట్టాడు. ఇక డాన్సులు ఈ సినిమాలో కొత్తగా ఉండటం, మా మా మహేశా పాటలో మాస్ స్టెప్పులతో ఆదరగొట్టాడు. సినిమా కాన్సెప్ట్ బాగున్నా దర్శకుడు సరిగా చిత్రాన్ని తీసుకెళ్లలేదనే టాక్ వినిపించింది.

మొత్తానికి మిశ్రమ స్పందనతో సినిమా రన్ అవుతోంది. ఇక రానున్న రోజుల్లో తెలుగులో పెద్ద చిత్రాలేవి విడుదల కాకపోవడంతో కొత్త చిత్రాలకు బాగా గ్యాప్ ఉండటంతో లాంగ్ రన్ కలెక్షన్స్ సర్కారు వారి పాట సినిమాకు కలసి వస్తాయని విశ్లేషిస్తున్నారు. ఇక సినిమాపై టాక్ వసూళ్లు పక్కన పెడితే సినిమాలో మహేష్ వయసు తగ్గి యంగ్ కుర్రాడిలా అందరిని ఆకట్టుకున్నాడు. ఇక సినిమాలో కూడా అపుడే పెళ్ళివయసు ఎక్కడోచ్చిందండి అనే డైలాగ్ లో ఈ పొగడ్తల వల్ల బాగా గ్లామర్ కాపాడుకోడానికి కష్టపడాల్సి వస్తోంది అంటూ మహేష్ చెప్పే డైలాగ్ నిజమే అనిపిస్తోంది.
కసరత్తులతో కష్టపడుతున్న సూపర్ స్టార్….
ఇక తన ఫిట్ నెస్ కోసం మహేష్ ఎంతలా కస్టపడుతున్నాడో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా తెలిస్తోంది. జిమ్ లో ఎక్సర్సైజులు చేస్తూ మహేష్ సర్కారువారి పాట సినిమా లుక్ కోసం కష్టపడ్డారు. రాత్రుళ్ళు కూడా కసరత్తులు చేయడం మనం చూడొచ్చు. మహేష్ ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన మినాష్ ఈ వీడియోని షేర్ చేశాడు. గంటల కొద్ది ఎక్సర్సైజులు చేస్తున్న వీడియో షేర్ చేసి గత రెండేళ్లుగా ఈ చిత్రం కోసం తెరవెనుక ఏమి జరిగిందో అందరికీ తెలియజేయడానికి నేను ఈ సమయం తీసుకుంటున్నాను. కోవిడ్ ఆంక్షల కారణంగా సినిమా విడుదల చాలా కాలం వాయిదా పడింది .
అయితే సర్కారు వారి పాట సినిమాని ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని మహేష్ చాలా కష్టపడ్డారు . ఓవర్ టైం షూటింగ్, అర్ధరాత్రి కూడా వర్కౌట్లు చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరి కోసం తన లైఫ్ పెట్టి పనిచేసారు మహేష్. ‘సర్కారు వారి పాట’ విడుదల సందర్భంగా ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను” అంటూ మినాష్ ట్వీట్ చేశారు. ఇపుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

































