Movie News

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై సెలెబ్రిటీల ట్వీట్ల వర్షం.. ట్రైలర్ పై మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్..!

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పీరియడ్ యాక్షన్ డ్రామా, RRR చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. 3.07 నిమిషాల వరకు ఉన్న ఈ ట్రైలర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. బాహుబలి తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ఆర్ఆర్ఆర్. అయితే ఈ ట్రైలర్ పై తెలుగు స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సంచుకున్నాడు.

ట్విట్టర్ ద్వారా ఇలా తెలియజేశాడు. “ట్రైలర్‌లోని ప్రతి షాట్ అద్భుతంగా ఉంది. మైండ్ బ్లోయింగ్!! మాస్టర్ స్టోరీటెల్లర్ తిరిగి వచ్చాడు. ట్రైలర్ అంతా గూస్‌బంప్స్!!” అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా.. సౌత్ మరియు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఇతర ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రష్మిక మందన్న ట్రైలర్‌ని “పిచ్చి” అని పిలుస్తుండగా.. వరుణ్ తేజ్ ట్రైలర్ ను “మైండ్ బ్లోయింగ్” అని పొగిడాడు.

బాలీవుడ్ స్టార్ లారా దత్తా భూపతి ట్విట్టర్‌లో ఇలా పంచుకున్నారు, గూస్‌బంప్స్!! హ్యాట్సాఫ్ @ssrajamouli సార్!! అంటూ ట్వీట్ చేశాడు. పూజా హెగ్డే కూడా మైక్రో బ్లాగింగ్ సైట్‌లో పోస్ట్ చేసింది. ఆమె ఇలా ట్వీట్ చేసింది, “ఉమ్మ్మ్… స్పీచ్లెస్. నా భావాలను ఎలా వివరించాలో కూడా అర్థం కావట్లేదు అంటూ.. ఆర్ఆర్ఆర్ టీం సభ్యులను పొగడ్తలతో మొంచెత్తింది.

ఇక ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. అజయ్ దేవగన్ మరియు అలియా భట్ ముఖ్యమైన పాత్రదారులుగా ఉన్నారు. సముద్రఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ మరియు శ్రియా శరణ్ కూడా సహాయక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం బ్రిటీష్, హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా.. విప్లవకారులు అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీమ్ పోరాడే సన్నివేశాలతో చిత్రీకరించారు. ఈ చిత్రం జనవరి 7, 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అమావాస్య ప్రభావమా?.. స్కూల్ రీఓపెన్ రోజున క్లాస్‌లో ఒక్క విద్యార్థినే!

వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…

1 hour ago

ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షాలు..మరో 4 రోజులు కుండపోతకు రెడ్ అలర్ట్!

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…

2 hours ago

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దొంగల కలకలం..వెంటాడిన రైల్వే పోలీసులు..

అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…

2 hours ago

విద్యార్థులకు బూట్లకు బదులు చెప్పులా? కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…

2 hours ago

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago