ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చెడ్డీ గ్యాంగ్ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ అలజడి రేపుతోంది. వారిని పట్టుకోవడంలో పోలీసులుకు సవాల్ గా మారింది. వారం రోజుల వ్యవధిలో ఈ దొంగల ముఠా.. నాలుగు చోరీలు చేసింది. పాల ఫ్యాక్టరీ, గుంటుపల్లి, రైయిన్ బో విల్లాస్‌లో కలకలం రేపింది. తాజాగా విజయవాడ పోరంకి వసంత నగర్‌లో చెడ్డీ గ్యాంగ్ మరో చోరీ చేసింది.
సుమారు 3 కేజీల వెండి, కొంత బంగారం, నగదు అపహరించింది. ప్రస్తుతం వీళ్లు నల్లూరి ఎన్‌క్లేవ్‌లో ప్రత్యక్షమయ్యారు. సీసీటీవీలో పోలీసులు గుర్తించే లోపే మయామైపోతున్నారు. ఇలా వాళ్లు వరుస దోపిడీలు చేస్తూ.. గుంటూరు వాసులకు కూడా కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. అయితే తాజాగా ఆ చెడ్డీ గ్యాంగ్ ఫొటోలను విజయవాడ పోలీసులు విడుదల చేశారు.
వీళ్లు గుజరాత్ లోని దాహాద్ ప్రాంతం నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలవగానే గుజరాత్ పోలీసులను విజయవాడ పోలీసులు సంప్రదించారు. అక్కడ కూడా ఇలాంటి దోపిడీలకు పాల్పడే ముఠా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ బ్యాచ్ ఎక్కడ ఉంది.. ఏ ఇంటికి స్పాట్ పెట్టారో తెలవక నగర వాసులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.
రాత్రి అయిందంటే చాలు.. ఏదైన పెద్ద శబ్ధం వినిపించిందంటే.. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. వాళ్లను చూస్తేనే నరరూపరాక్షసులులాగా కనిపిస్తున్నారు. చేతిలో పార, తలకు పాగా, ఒంటికి చెడ్డీ తో 10 మంది ముఠాగా చేరి ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. వారి చెర నుంచి తమను రక్షించండి అంటూ.. ప్రజలు భయాందోళనకు గురవుతూ.. పోలీసులను కోరుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…