Connect with us

Featured

చెడ్డీ గ్యాంగ్ తో భయాందోళనకు గురవుతున్న ప్రజలు.. ఆ గ్యాంగ్ ఫొటోలను విడుదల చేసిన పోలీసులు..!

Published

on

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చెడ్డీ గ్యాంగ్ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ అలజడి రేపుతోంది. వారిని పట్టుకోవడంలో పోలీసులుకు సవాల్ గా మారింది. వారం రోజుల వ్యవధిలో ఈ దొంగల ముఠా.. నాలుగు చోరీలు చేసింది. పాల ఫ్యాక్టరీ, గుంటుపల్లి, రైయిన్ బో విల్లాస్‌లో కలకలం రేపింది. తాజాగా విజయవాడ పోరంకి వసంత నగర్‌లో చెడ్డీ గ్యాంగ్ మరో చోరీ చేసింది.

సుమారు 3 కేజీల వెండి, కొంత బంగారం, నగదు అపహరించింది. ప్రస్తుతం వీళ్లు నల్లూరి ఎన్‌క్లేవ్‌లో ప్రత్యక్షమయ్యారు. సీసీటీవీలో పోలీసులు గుర్తించే లోపే మయామైపోతున్నారు. ఇలా వాళ్లు వరుస దోపిడీలు చేస్తూ.. గుంటూరు వాసులకు కూడా కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. అయితే తాజాగా ఆ చెడ్డీ గ్యాంగ్ ఫొటోలను విజయవాడ పోలీసులు విడుదల చేశారు.

వీళ్లు గుజరాత్ లోని దాహాద్ ప్రాంతం నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలవగానే గుజరాత్ పోలీసులను విజయవాడ పోలీసులు సంప్రదించారు. అక్కడ కూడా ఇలాంటి దోపిడీలకు పాల్పడే ముఠా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ బ్యాచ్ ఎక్కడ ఉంది.. ఏ ఇంటికి స్పాట్ పెట్టారో తెలవక నగర వాసులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.

Advertisement

రాత్రి అయిందంటే చాలు.. ఏదైన పెద్ద శబ్ధం వినిపించిందంటే.. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. వాళ్లను చూస్తేనే నరరూపరాక్షసులులాగా కనిపిస్తున్నారు. చేతిలో పార, తలకు పాగా, ఒంటికి చెడ్డీ తో 10 మంది ముఠాగా చేరి ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. వారి చెర నుంచి తమను రక్షించండి అంటూ.. ప్రజలు భయాందోళనకు గురవుతూ.. పోలీసులను కోరుతున్నారు.

Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!