Mahesh Babu: మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో నటించిన సినిమా ఈ నెల 12వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా యాంకర్ సుమ మహేష్ బాబు, డైరెక్టర్ పరుశురామ్ తో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ క్రమంలోనే సుమ మహేష్ బాబును పలు ప్రశ్నలు అడిగారు.
ఈ సందర్భంగా సుమ ప్రశ్నిస్తూ బయట చాలామంది గురించి ఎన్నో రకాల గాసిప్స్ వింటూ ఉంటాము అలాగే మాట్లాడుతూ ఉంటాము.మీరు కూడా నమ్రతతో ఇలాంటి గాస్సిప్స్ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు మహేష్ బాబు ఎంతో ఆశక్తికరమైన సమాధానం వెల్లడించారు.
తాను నమ్రతతో కలిసి ఎప్పుడు ఇలాంటి గాసిప్స్ గురించి మాట్లాడలేదని మహేష్ బాబు వెల్లడించారు. అయితే నమ్రత తన స్నేహితులతో కలిసినప్పుడు ఎక్కువగా మాట్లాడతారని, ఆ గాసిప్స్ మనం వినలేము అని మహేష్ బాబు వెల్లడించారు.
అసలే నమ్రతది ముంబై ఇక తన స్నేహితులతో కలిసి ఇలాంటి గాసిప్స్ గురించి చాలా చండాలంగా మాట్లాడుతుంటారని, ఒక్కోసారి ఆ మాటలను నేను వినలేనని, అవి చెప్పడానికి కూడా వీలులేకుండా ఉంటాయని నమ్రత గురించి మహేష్ బాబు ఈ సందర్భంగా వెల్లడించారు.మొత్తానికి గాసిప్స్ గురించి, నమ్రత గురించి మహేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…