ఇటీవలే నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.. ఈ సినిమా పై అయన మంచి అంచనాలు పెట్టుకున్నాడు నాగార్జున.. అయన నటించిన గత చిత్రాలు సరిగ్గా ఆడకపోవడంతో ఈ సినిమా హిట్ తప్పనిసరి అయింది.. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ ని గట్టిగా చేయాలనీ చూస్తున్నాడు నాగార్జున.. ఈ నేపథ్యంలోనే వెరైటీ గా వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నారు.అలీరెజాతో పాటు సయామీ ఖేర్ కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇకపోతే ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశాడు మెగా స్టార్ చిరంజీవి.. అది చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు నాగార్జునను ప్రశంసిస్తూ విషెస్ తెలిపారు. అందులో మహేష్ బాబు కూడా ఉన్నాడు. ఈయన కూడా ట్రైలర్ చూసిన తర్వాత నాగార్జున స్టైల్‌తో పాటు ట్రైలర్ మేకింగ్ కూడా మెచ్చుకున్నాడు. ఈ చాట్ కి సంబందించిన స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు నాగార్జున.అవి కాస్తా వైరల్ అయ్యాయి. అది కూడా వాళ్ల అనుమతి తీసుకున్న తర్వాతే పోస్ట్ చేసాడు మన్మథుడు.
అయితే దీనికి బాలకృష్ణ కి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా..మహేష్ తన వాట్సాప్ డీపిగా గర్జిస్తున్న సింహం ఫోటోను పెట్టుకున్నాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నాగార్జున వల్ల తమ హీరో వాట్సాప్ డీపి బయటికి వచ్చిందంటూ పండగ చేసుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ డీపీ చూసి సూపర్ అంటున్నారు. ఎందుకంటే గర్జిస్టున్న సింహం అంటే ముందుగా గుర్తొచ్చేది బాలయ్యే. సింహం అనే పదానికి నిదర్శనంగా బాలయ్య ఉంటాడంటారు అభిమానులు. ఇకపోతే .సాల్మన్ దర్శకత్వంలో రాబోతున్న వైల్డ్ డాగ్ సినిమా లో షయామీ ఖేర్ కీలక పాత్రధారి గా చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…