Featured

టాలీవుడ్ కు మరో విజయ్ దేవరకొండ దొరికినట్లేనా..?

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సృష్టిస్తున్న సంచలనం అంతా కాదు.. పెళ్లి చూపులతో మొదలైన ఈ ప్రభంజనం ఇప్పటికీ ఆగట్లేదు. అర్జున్ రెడ్డి తో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు.. ఈ సినిమా తో ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు విజయ్.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుంది.

ఇకపోతే ఇటీవలే టాలీవుడ్ లో రిలీజ్ అయ్యింది జాతిరత్నాలు సినిమా.. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఉప్పెన తర్వాత ఆ లెవెల్లో హిట్ అయిన సినిమా జాతిరత్నాలు.. ఇప్పటికీ హౌస్ ఫుల్ అవుతూ వస్తుంది సినిమా.. నార్మల్ హీరోగా ఉన్న నవీన్ పోలిశెట్టి క్రేజ్ కూడా ఓ రేంజ్ లో పెరిగింది. ఈ సినిమా లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లు ముఖ్య పాత్రల్లో నటించగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసింది. ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయడం, విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ కి రావడం ఇవన్నీ ఈ సినిమా కి మంచి ప్లస్ పాయింట్స్ అవగా సినిమా కి సూపర్ హిట్ టాక్ వచ్చింది.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హిట్ సాధించిన నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు నవీన్.. జాతిరత్నాలు సినిమాలో అన్ని ఎమోషన్స్ ను అద్భుతంగా పండించి ఆ సినిమా సక్సెస్ కు నవీన్ పోలిశెట్టి ప్రధాన కారణమయ్యారు. నవీన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా హిట్టైతే మాత్రం నవీన్ సులువుగా విజయ్ దేవరకొండ రేంజ్ ను అందుకోగలుగుతారని చెప్పవచ్చు. జాతిరత్నాలు సినిమా నవీన్ వన్ మ్యాన్ షో అంటూ నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్న కామెంట్లు నవీన్ కెరీర్ కు ప్లస్ అవుతున్నాయి. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తున్న నవీన్ పోలిశెట్టి అనుష్క సినిమాలో హీరోగా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago