టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సృష్టిస్తున్న సంచలనం అంతా కాదు.. పెళ్లి చూపులతో మొదలైన ఈ ప్రభంజనం ఇప్పటికీ ఆగట్లేదు. అర్జున్ రెడ్డి తో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు.. ఈ సినిమా తో ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు విజయ్.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుంది.

ఇకపోతే ఇటీవలే టాలీవుడ్ లో రిలీజ్ అయ్యింది జాతిరత్నాలు సినిమా.. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఉప్పెన తర్వాత ఆ లెవెల్లో హిట్ అయిన సినిమా జాతిరత్నాలు.. ఇప్పటికీ హౌస్ ఫుల్ అవుతూ వస్తుంది సినిమా.. నార్మల్ హీరోగా ఉన్న నవీన్ పోలిశెట్టి క్రేజ్ కూడా ఓ రేంజ్ లో పెరిగింది. ఈ సినిమా లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లు ముఖ్య పాత్రల్లో నటించగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసింది. ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయడం, విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ కి రావడం ఇవన్నీ ఈ సినిమా కి మంచి ప్లస్ పాయింట్స్ అవగా సినిమా కి సూపర్ హిట్ టాక్ వచ్చింది.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హిట్ సాధించిన నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు నవీన్.. జాతిరత్నాలు సినిమాలో అన్ని ఎమోషన్స్ ను అద్భుతంగా పండించి ఆ సినిమా సక్సెస్ కు నవీన్ పోలిశెట్టి ప్రధాన కారణమయ్యారు. నవీన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా హిట్టైతే మాత్రం నవీన్ సులువుగా విజయ్ దేవరకొండ రేంజ్ ను అందుకోగలుగుతారని చెప్పవచ్చు. జాతిరత్నాలు సినిమా నవీన్ వన్ మ్యాన్ షో అంటూ నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్న కామెంట్లు నవీన్ కెరీర్ కు ప్లస్ అవుతున్నాయి. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తున్న నవీన్ పోలిశెట్టి అనుష్క సినిమాలో హీరోగా నటిస్తున్నట్టు తెలుస్తోంది.































