Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వ్యాపార రంగంలో కూడా ఇప్పటికైనా ఏఎంబి సినిమాస్ కూడా ప్రారంభిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా ఒక వైపు వ్యాపార రంగంలోనూ మరోవైపు సినిమా రంగంలోనూ ఎంతో సక్సెస్ అయ్యారు.
ఇలా రెండు వైపులా భారీ లాభాలను తీసుకుంటున్నటువంటి మహేష్ బాబు తాజాగా మరొక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైనట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం మహేష్ బాబు రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నారని ప్రస్తుతం రెస్టారెంట్లను హైదరాబాద్ లో స్థాపించి ఇక్కడ బాగా డెవలప్ అయిన తర్వాత దేశమంతటా తమ రెస్టారెంట్లను ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నారట.
ఈ క్రమంలోనే ప్రస్తుతం రెస్టారెంట్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని త్వరలోనే వీటిని ప్రారంభం చేయబోతున్నారని సమాచారం.ఇక మహేష్ బాబు తన భార్య నమ్రత పేరు మీద రెస్టారెంట్లను ప్రారంభించబోతున్నారు అయితే మహేష్ బాబు ప్రారంభించే రెస్టారెంట్ల పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ బాబు ప్రారంభించే రెండు రెస్టారెంట్లకు ఒకటి ‘మినర్వా ఎన్’ (ఏషియన్ నమ్రత) నవంబర్ లో, మరొకటి ‘పాలస్ హైట్స్’ డిసెంబర్‌లో ప్రారంభించబడుతుంది.
ఈ రెండు హోటళ్లలో ఒక హోటల్ నగరంలోని బంజారా హిల్స్ ప్రాంతంలోని టీఆర్ఎస్ ఆఫీస్ పార్టీ కార్యాలయం దగ్గర స్థాపించబోతున్నారట ప్రస్తుతం ఈ హోటల్ ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. ఎంతో విలాసవంతమైన పార్కింగ్ తో పాటు రెస్టారెంట్ ను కూడా ఎంతో విలాసవంతంగా నిర్మించబోతున్నారని సమాచారం. ఇక ఈ హోటల్ కార్యకలాపాలన్నింటిని నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…