Featured

Pragathi : రెయిన్ సాంగ్ కి అలాంటి బట్టలేసుకోమంటే హీరోయిన్ అవకాశం వదులుకున్నా… ఆ సమయంలో బాగా ఏడ్చేదాన్ని : నటి ప్రగతి

Pragathi : తెలుగులో అమ్మ పాత్రలలో ఎక్కువగా మెరిసి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన నటి ప్రగతి అందరికీ తెలుసు, ఇదంతా కరోనా ముందు అనాలేమో. ఇప్పుడు మాత్రం అమ్మ పాత్రలతో కాదు ఇంస్టాగ్రామ్ రీల్స్ తో బాగా పాపులర్. కూతురుతో కలిసి డాన్సులు, ఇక తన వర్క్ అవుట్ వీడియోలతో తాను ఇప్పటి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోను అన్నట్లుగా దూసుకెళతోంది. ఇక ప్రగతి ఆంటీకి ఇంస్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ప్రగతి మొదట హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చినా ఒక ఏడో ఎనిమిదో సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది.

హీరోహీరోయిన్లతో అలా పిలిపించుకోడానికి ఏడ్చేసాను…

సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న సమయంలో రెయిన్ డాన్స్ సీన్ లో ఇబ్బందికరంగా ఉన్న బట్టలను నేను వేసుకోను అంటే ఒప్పుకోలేదు, దీంతో ఇక హీరోయిన్ గా సినిమాల్లో నటించలేనని సీరియల్స్ వైపు వెళ్ళిపోయాను అంటూ ప్రగతి ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తమిళం, తెలుగులో పలు సీరియల్స్ లో నటించిన ప్రగతి ఆ తరువాత మళ్ళీ మహేష్ బాబు ‘బాబీ’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో ఇక తల్లి పాత్రలతో కంటిన్యూ అయింది. అయితే చిన్న వయసులోనే తల్లి పాత్రల్లో నటించడం వల్ల బాగా ఏడుపొచ్చేది అంటూ చెప్పారు.

చంద్రమోహన్ గారి కుటుంబంతో మంచి అనుబంధం ఉండేది, ఆయన భార్యను ఆంటీ అని పిలిచేదాన్ని కానీ ఆయన పక్కన భార్యగా సినిమాల్లో నటించాను. నా వయసు హీరోయిన్లు నన్ను అమ్మ అంటుంటే బాధేసేది. ఇక షూటింగ్ సెట్స్ కి స్టైల్ జడలు వేసుకుని వస్తే తల్లి పాత్రలు చేసే ఆమె ఇలాంటి జడలు అవసరమా అంటూ సూటిపోటి మాటలను అనేవారు. ఆ టైములో మేకప్ రూమ్ లోకి వెళ్లి గట్టిగా ఏడ్చేదాన్ని అంటూ తన కెరీర్ లో పడిన బాధలను ప్రగతి ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago