Movie News

Mahesh Babu Restaurent: మహేష్ బాబు రెస్టారెంట్లో రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే… ఆకాశాన్ని తాకుతున్న రేట్లు!

Mahesh Babu Restaurent:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా మహేష్ బాబు హీరోగా నటిస్తూ ఏషియన్ వారితో కలిసి ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఏఎంబి మల్టీప్లెక్స్ థియేటర్ ను ఎంతో సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నటువంటి మహేష్ బాబు తాజాగా ఏషియన్స్ వారితో కలిసి రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టారు.

ఈ విధంగా మహేష్ బాబు తన భార్య పేరు మీదుగా ఏషియన్స్ వారితో కలిసి ఈ రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏషియన్ నమ్రత పేరు మీదుగా ఏఎన్ రెస్టారెంట్ ప్రారంభించారు.ఇక చూడటానికి హై లెవెల్ లో ఉన్నటువంటి ఈ రెస్టారెంట్లో భోజనాల రేట్లు కూడా అలాగే ఉన్నాయని తెలుస్తోంది.

ఇక ఈ రెస్టారెంట్లో ఒక కప్పు కాఫీ ధర 80 రూపాయలు. రెండు ఇడ్లీల ధర 90 రూపాయలు. ఒక ప్లేట్ బజ్జి 125 ఉండడంతో ఈ ధరలు చూసి సామాన్య ప్రజలు షాక్ అవుతున్నారు.ఇలా మహేష్ బాబు రెస్టారెంట్లో రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఈ రెస్టారెంట్లో రేట్లు కూడా తగ్గవచ్చు అని పలువురు భావిస్తున్నారు.

Mahesh Babu Restaurent: చుక్కలని తాకుతున్న ధరలు…

ఇక ఈ రెస్టారెంట్లో ధరలు కనుక ఇలాగే కొనసాగితే మహేష్ బాబు రెస్టారెంట్లో భోజనం చేయడం సామాన్యులకు వీలు కాదని కేవలం బాగా డబ్బున్న వారు మాత్రమే ఈ రెస్టారెంట్లో భోజనం చేసే అవకాశం ఉంటుందంటూ పలువురు మహేష్ బాబు రెస్టారెంట్లో ధరల గురించి చర్చలు మొదలుపెట్టారు. మరి మహేష్ బాబు కేవలం ధనవంతులకు మాత్రమే తన రెస్టారెంట్లో భోజనం చేసే అవకాశం కల్పిస్తారా లేక ధరలు తగ్గించి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago