Categories: FeaturedMovie News

Mahesh Babu: గుంటూరు కారం నా ఆఖరి తెలుగు చిత్రం… షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ !

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు. ఈయన ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  ఇక ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ అనంతరం మహేశ్ బాబు, శ్రీలీల ఇద్దరు కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  ఈ ఇంటర్వ్యూకి సుమ యాంకర్ గా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో మహేష్ క్యారక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్, స్లాంగ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ విషయం గురించి మహేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.

సినిమా మొదలు పెట్టినప్పుడే నేను త్రివిక్రమ్ అయితే ఒక విషయం గట్టిగా అనుకున్నాము. ఈ సినిమాలో ఓ రెండు పాటలు అయినా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే నేను ఈ సినిమా తరువాత తెలుగు సినిమాలు చేయకపోవచ్చు అంటూ మహేష్ షాక్ ఇచ్చారు.మళ్ళీ మన తెలుగు మాస్ సాంగ్స్ కి డాన్స్ చేసే అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు.

ఇక పై తెలుగు సినిమాలు చేయకపోవచ్చు…

మరో తెలుగు సినిమా వస్తుందో రాదో తెలియకనే ఈ సినిమాలో పాటలను గట్టిగా ప్లాన్ చేసాము. దానికి తగ్గట్టే మూవీలోని మొదటి సాంగ్ అండ్ లాస్ట్ సాంగ్ ని ప్లాన్ చేశాము. అలాగే సెకండ్ హాఫ్ లో గో‌డౌన్‌లో ఒక సాంగ్ బిట్టు వస్తుంది. నెక్లీస్ గొలుసు సాంగ్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యామని మహేష్ తెలిపారు. కానీ ఈ అమ్మాయి డాన్స్ చూసే సరికి కాస్త భయం వేసిందని ఈ సందర్భంగా మహేష్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago