Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి కాస్త మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం భారీగా కలెక్షన్స్ రాబడుతూ మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నటువంటి తరుణంలో మహేష్ బాబు శ్రీ లీల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబుకు సినిమాలో తరచూ బీడీ తాగే సీన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి . అయితే ఈ బీడి గురించి మహేష్ బాబు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నాకు అసలు స్మోక్ అంటేనే నచ్చదు. నేను స్మోకింగ్ ఎంకరేజ్ కూడా చేయనంటూ మహేష్ బాబు తెలిపారు.
ఇక నేను గుంటూరు కారం సినిమాలో తాగిన బీడీ రియల్ బీడీ కాదని, అదొక ఆయుర్వేదిక్ బీడీ అంటూ మహేష్ బాబు అసలు విషయం వెల్లడించారు. మొదటి రోజు షూటింగ్లో తాను రియల్ బీడీ తాగాను. నాకు వెంటనే మైగ్రేన్ హెడేక్ వచ్చింది. నా వల్ల కాలేదు త్రివిక్రమ్ గారని చెప్పగానే ఆయన మరేం చేద్దామని ఆలోచించి ఆయుర్వేదిక్ బీడీ తెప్పించారు.
ఆయుర్వేదిక్ బీడీ…
దీంట్లో ఎలాంటి పొగాకు కానీ ఇతర మత్తు పదార్థాలు కాని ఉండవు కేవలం పుదీనా లవంగా ఫ్లేవర్స్ తో ఉందని దానివల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని మహేష్ బాబు తెలిపారు. ఇలా ఒక ఆయుర్వేదిక్ బీడీతోనే సినిమా మొత్తం కానిచ్చేసాము అంటూ ఈ సందర్భంగా మహేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…