టాలీవుడ్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ. ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే వెండితెరపై తనదైన శైలిలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన బాలకృష్ణ ప్రస్తుతం బుల్లితెరపై కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ బుల్లితెరపై అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మంచు ఫ్యామిలీ వచ్చి సందడి సందడి చేశారు. అనంతరం ఈ ఫ్యామిలీ రెండవ ఎపిసోడ్ కు టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు కూడా ఈ షోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే మహేష్ బాబు ఎపిసోడ్ కి సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే మహేష్ బాబు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సందడి చేయబోతున్నారని అర్థమవుతోంది . సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం డిసెంబర్ 4న మహేష్ బాబు బాలకృష్ణ ఒక వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తుంది.
ఈ వార్త ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అలా బాలకృష్ణ మహేష్ బాబు అరుదైన కాంబినేషన్ లో రెండు మూడు రోజుల్లో రానుందని తెలిసిన బాలకృష్ణ మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ షో ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…