Featured

#BholaShankar భోళా శంకర్‌‌గా మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి మాములుగా ఉండదు!

మెగాస్టార్ చిరంజీవి తన రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే “ఖైదీ నెంబర్ 150” చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తరువాత “సైరా నరసింహారెడ్డి” ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం చిరంజీవి తన 153 వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 కావడంతో తన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ నటించబోయే 154 వ చిత్రానికి సంబంధించి తాజా ప్రకటన తెలియజేశారు.

మెగాస్టార్ తన 154వ చిత్రంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో “వేదాళం” సినిమాకు రీమేక్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలోనే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను చిత్రబృందం తెలియజేశారు. ఈ సందర్భంగా ఈసినిమాకు “భోళాశంకర్”అనే టైటిల్ ను ఖరారు చేసారు.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేసారు. మెగాస్టార్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో అజిత్ హీరోగా నటించిన టువంటి “వేదాళం” సినిమా ఎంతో విజయవంతమైంది. తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ముందుగా పవన్ కళ్యాణ్ హీరోగా చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించే అవకాశం మెగాస్టార్ కి వచ్చింది.

వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న “భోళాశంకర్” సినిమాలో మెగాస్టార్ చిరంజీవి విభిన్నమైన లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలి పాత్ర ఎంతో కీలకమైనదని, ఈ కీలక పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుందనే సమాచారం వినబడుతుంది. మొత్తానికి మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా తన 154 వ చిత్రానికి సంబంధించిన టైటిల్ ని తెలియజేయడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఆల్‌టైం కనిష్టానికి రూపాయి… జనవరి నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ ధరల పెరుగుదల తప్పదా?

భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…

3 weeks ago

చలికాలంలో ‘షాక్’ కొడుతోందా? వస్తువులను తాకితే కరెంట్ తగిలినట్లు ఎందుకు అనిపిస్తుంది?

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…

3 weeks ago

యోగాకు ఏ సమయం ‘బెస్ట్’? ఉదయమా? సాయంత్రమా? నిపుణులు ఏమంటున్నారు?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…

3 weeks ago

చేపలతో ఇవి కలిపి తింటే ప్రమాదమే! ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…

3 weeks ago

మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉపాధి హామీ చట్టానికి ముగింపు? కొత్త చట్టానికి సిద్ధం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

3 weeks ago

16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా పూర్తిగా బ్యాన్! ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం – కారణాలు చూసి షాక్ అవుతారు

ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…

3 weeks ago