Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలు పెట్టి ఆ తరువాత ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా పరిచయమై అమ్మాయిల మనసు దోచేసాడు. ఇక టాలీవుడ్ ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న మహేష్ అటు అమ్మాయిల మనసులను దోచే సినిమాలనే కాదు ఇటు ప్రయోగాలను చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. ఇక తాజాగా వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ బాబు కు ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది. వరుసగా అన్న, అమ్మ, నాన్న మరణించడంతో ఒంటరి అయిపోయాడు.

నమ్రత తో పెళ్ళికి నాన్న అడిగిన ప్రశ్న…
ఇక అందరికీ తెలిసిన విషయమే మహేష్ బాబు హీరోయిన్ నమ్రత శిరోడ్కర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘వంశీ’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ 2005 ఫిబ్రవరి 10 న వీరి పెళ్లి ముంబై లో చాలా సింపుల్ గా చేసుకున్నారు. పెళ్లయ్యాక మహేష్ బాబు సినిమా వ్యవహారాలు, ఆయన స్టైలింగ్, లుక్స్ ఇలా అన్ని విషయాలను నమ్రత చూసుకుంటున్నారు. ఇక సినిమా నిర్మాణంలోనూ ఉన్న నమ్రత మహేష్ అన్ని వ్యవహారాలు చూస్తూనే కుటుంబ బాధ్యతలు తీసుకుని నటనకు గుడ్ బై చెప్పేసారు.

ఇక నమ్రత ను పెళ్లి చేసుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదా, కృష్ణ గారిని ఎలా ఒప్పించారు మహేష్ అనే విషయాలు మహేష్ స్వయంగా చెప్పారు. తనతో లైఫ్ బాగుంటుంది అనుకున్నాక వెళ్లి నాన్నను ఇలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెబితే ‘ఆర్ యూ షూర్’ అని అడిగారు. నేను అవును నాన్న అంటే సరే అయితే చేసుకో అని చెప్పారు అంతే తాను ఇతర రాష్ట్ర అమ్మాయి అందుకే ఆ ఒక్కమాట ఆయన అడిగారు లేకపోతే అదీ అడగరు, నీకు నచ్చితే ఓకే అంటారు. ఆయనకు నా మీద నమ్మకం ఉంది అంటూ మహేష్ చెప్పారు.






























