MaheshBabu-Allu Arjun: ఐకాన్ స్టార్ బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో పెద్ద హిట్ అయింది. టాలీవుడ్ నుంచే కాకుండా… బాలీవుడ్ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే… సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పుష్ప సినిమాను తెగపొగిడాడు. పుష్పచిత్రాన్ని అభినందిస్తూ మంగళవారం ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపించారు. పుష్ప పాత్రలో అద్భుతమైన నటనని ప్రదర్శించారని అన్నాడు. మరోవైపు డైరెక్టర్ సుకుమార్ ను కూడా పొగిడారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను కూడా అభినందిస్తూ.. మహేష్ బాబు ట్విట్ చేశాడు. దీనికి బన్నీ కూడా థాక్స్ తెలిపాడు.
ఇదిలా ఉండే మహేష్ ట్విట్ తో ఇటు ఆయన ఫ్యాన్స్ తో పాటు బన్నీ ఫ్యాన్స్ కూడా తెగ ఖుషీ అవుతున్నారు. ఇది నిజమేనా? అంటూ బన్నీ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మహేష్ ఫ్యాన్స్ మాత్రం బాబు మనసు గోల్డ్ అని పోస్ట్ లు పెడుతున్నారు. బాబులకు బాబు మా మహేష్‌బాబు` అంటూ ట్వీట్లు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఉన్న పోరుకు తాజాగా మహేష్ చేసిన ట్విట్ ముగింపు పలికేలా ఉందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇదంతా ఇలా ఉంటే… ప్రస్తుతం ఈ ట్విట్ మరో వివాదానికి కేరాఫ్ గా మారింది. అందరీని అభినందించిన మహేష్ బాబు.. హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక ను మాత్రం అభినందించలేదు. మర్చిపోయాడా… లేకపోతే కావాలని స్కిప్ చేశాడా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి మహేష్ బాబు- రష్మికలు కలిసి ‘‘సరిలేరు నీకెవ్వరు’’లో కలిసి నటించారు. కాబట్టి మరిచిపోయే అవకాశమే లేదని కావాలనే స్కిప్ చేశారని అనుకుంటున్నారు. ఈ మధ్య రష్మికా తెగ ఓవర్ చేస్తుందని.. తన గురించి ప్రస్తావించకపోవడమే బెటర్ అంటూ కొంత మంది కామెంట్లు కూడా చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…