Samantha: ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో కొంత ఫేమ్ ఉన్న స్టార్లు అంతా ప్యాన్ ఇండియా లెవల్లో సినిమాను తీయాలనే ఆశతో .. కోరికతో ఉన్నారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఇప్పటికే పుష్పతో ఎంట్రీ ఇవ్వగా.. న్యాచురల్ స్టార్ నానీ కూడా శ్యామ్ సింగరాయ్ తో ఆ కోరిక తీరింది.
ఇక దీనికి ముఖ్యంగా నాంది పలికిన ప్రభాస్.. అతడి ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కిస్తున్నాడు. ఇక హారోయిన్ల విషయానికి వస్తే.. రకుల్, రష్మిక బాలీవుడ్ లో పాగా వేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో దాదాపు ఆరు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. రష్మికా చేతిలో కూడా ప్రస్తుతం రెండు నుంచి మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి.
ఇలా హీరోయిన్లు కూడా క్యూ కట్టేస్తున్నారు. వీరిద్దరి కంటే మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత కాస్త వెనుకపడిందనే చెప్పాలి. వీళ్లకంటే ముందుగానే గతంలో అవకాశాలు వచ్చాయి.. కానీ ఫ్యామిలీకి భయపడో మరేదైనా కారణం అయి ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టలేదు.
విడాకుల తర్వాత సమంత పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె వెబ్ సిరీస్ ల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇప్పటికే ఆమె సిటాడెల్ సిరీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది హాలీవుడ్ సిరీస్ రీమేక్. సిటాడెల్ హిందీతో పాటు రీజనల్ భాషల్లో కూడా విడుదల కానుంది.ఇలా ఆమె బాలీవుడ్ ప్రముఖులతో కూడా టచ్ లో ఉంటుంది. ఆమె ప్రస్తుతం శాకుంతలంలో నటించగా.. అది హిందీలో కూడా విడుదల కానుంది. తర్వాత యశోద సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. వీటిలో ఏ ఒక్కటి విజయం సాధించినా సమంత బాలీవుడ్ లో చక్రం తిప్పడం ఖాయం. ఇలా ఆమె విడాకుల ప్రస్తావన తర్వాత కెరీర్ లో దూసుకుపోతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…