పిల్లలు సాధించిన విజయాలు చుస్తే ఆ తల్లిదండ్రుల ఆనందానికి మాటలుండవు.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ అటువంటి ఆనందంలోనే ఉంది. కొడుకు గౌతమ్.. చిన్న వయసులోనే స్విమ్మింగ్‌లో రికార్డు సృష్టించాడు. తండ్రి మహేష్ బాబు తన సినిమాలతో రికార్డులు సృష్టిస్తుంటే తనయుడు గౌతమ్ స్విమ్మింగ్ లో రికార్డులు సృష్టిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తాజాగా తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 స్విమ్మర్స్ లిస్ట్‌లో స్థానం సంపాదించాడు గౌతం ఘట్టమనేని.
ఈ నేపధ్యంలో కేవలం 15 ఏళ్ల వయసులోనే గౌతమ్ సాధించిన ఈ ఘనత పట్ల తల్లి నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది నమ్రత. కొడుకు సాధించిన ఈ ఘనతకు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కొడుకుపై ప్రేమ కురిపించింది. 2018లోనే గౌతమ్ ఫ్రొఫెషనల్ స్విమ్మర్‌గా మారాడని, అప్పటినుంచి స్విమ్మింగ్‌లో సత్తా చాటుతున్నాడని ఆమె తెలిపింది. బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొట్టగల గౌతమ్, 3 గంటల్లో 5 కిలోమీటర్లు ఈదగలడని చెప్పుకొచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…