ఈరోజు చంద్రగ్రహణం కారణంగా భారత్‌లోని చాలా ఆలయాలు భక్తుల కోసం మూతపడుతున్నాయి. సాధారణంగా గ్రహణ సమయంలో దర్శనాలు, ప్రత్యేక పూజలు నిలిపివేయబడతాయి. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మాత్రమే ఆలయాలు తిరిగి భక్తుల కోసం తెరిచబడతాయి. అయితే, కొన్ని ప్రసిద్ధ ఆలయాలు ప్రత్యేకంగా తెరవబడి ఉంటాయి, భక్తులు చూడవచ్చు.

దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి ఆలయం, తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం, కర్ణాటకలో ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కేరళలో తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఈరోజు తెరిచి ఉంటాయి.
ఉత్తర భారతంలో మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్, ఢిల్లీలో కల్కాజీ దేవి ఆలయం, బీహార్‌లో విష్ణుపద్ ఆలయం, రాజస్థాన్‌లో లక్ష్మీనాథ్ టెంపుల్, ఉత్తరాఖండ్‌లో కల్పేశ్వర్ ఆలయం భక్తుల సందర్శన కోసం తెరిచి ఉంటాయి.
ఈ ఆలయాల దర్శనం కోసం వచ్చే భక్తులు, రకరకాల ఆచారాలు, పూజా విధానాలు గ్రహణ సమయంలో కూడా కొనసాగుతాయని, భక్తులు శాంతియుతంగా, క్రమపద్ధతిలో దర్శనం చేయగలరని అధికారులు సూచిస్తున్నారు.





























