Mamatha : సినిమా ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. తెర ముందు ఎంత అందంగా ఉంటుందో తెర వెనుక ఆర్టిస్టులు అన్ని కష్టాలను పడుతుంటారు. ఈ రంగుల ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలని డబ్బు సంపాదించాలని ఎంతో మంది ఆశగా వస్తుంటారు. కానీ అందులో నిలదొక్కుకుని సినిమాలతో ప్రయాణించేది కొంత మందే. మరి కొంతమంది అవకాశాలతో మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్నా వ్యక్తిగతంగా మాత్రం సక్సెస్ కాలేరు. అలాంటి అలనాటి నటి మమత, హీరోయిన్ గా మొదలై కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుని చివరికి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసి పేదరికంలో మరణించింది.
చిరంజీవి గారు సహాయం చేసి చెప్పొద్దన్నారు…
సినిమాల మీద ఇష్టంతో చెన్నై వచ్చి కూచిపూడి నృత్యం నేర్చుకుని భూమి కోసం సినిమాలో పాటతో మొదలైన మమత సినిమా కెరీర్ ఆ తరువాత మలయాళం లో హీరోయిన్ గా రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక తెలుగులోనూ హీరోయిన్ గా చేసినా పెద్దగా రాణించలేదు. ఇక రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన అడవిరాముడులో కమెడియన్ పాత్ర ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న మమతా ఇక ఆ తరువాత కామెడీ పాత్రలను అధికంగా చేసారు. సుమారు 250 సినిమాల్లో తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ ఇలా పలు భాషల్లో నటించిన మమత బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు. కానీ సంపాదించిన డబ్బు బంధువులకు సహాయం చేయడం తన కుటుంబం కోసం ఖర్చు చేయడంతో తనకంటూ ఏమి లేకుండా చేసుకున్నారు. ఇక ఒక ఫేమస్ డబ్బింగ్ రైటర్ తో చనువుగా ఉంటూ ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉండి మోసం చేయడం వల్ల మమత వివాహం కూడా చేసుకోలేదని ఆమె తమ్ముడు రమేష్ గారు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో వివరించారు.
తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ వెళ్లిపోయిన తరుణంలో మమత చెన్నై లోనే స్థిరపడ్డారు. హైదరాబాద్ కి వెళ్లాలని అనుకోలేదు అందువల్ల అవకాశలు తగ్గిపోవడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు తెలుగు సినిమాలకు, సీరియల్స్ కు ఆవిడ పని చేసారు. ఆర్థికంగా పూట గడవని పరిస్థితుల్లో జయలలితను కలిసి తన పరిస్థితి చెప్పగా చిరంజీవి ఆమె ద్వారా తెలుసుకుని సహాయం చేశారట. ఆయన సహాయం చేసినట్టు చెప్పొద్దని చెప్పి డబ్బు సహాయం చేశారట. ఇక మళ్ళీ ఒక ఏడాది గడిచాక మళ్ళీ ఆర్థిక అవసరాలకోసం చిరంజీవి గారి ఆఫీస్ కు ఫోన్ చేస్తే వెంటనే 50,000 రూపాయలు మమత అకౌంట్ లోకి వేశారని ఆమె తమ్ముడు చిరంజీవి గారి ధాత్రుత్వాన్ని తెలిపారు. ఇక ఆమె తన 55 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఆసుపత్రిలో చేరినా ఫలితం లేదని డాక్టర్లు చెప్పగా ఆ రోజే ఆమె మరణించారు. అప్పటికి తెలుగు నటులంతా హైదరాబాద్ లో ఉండటం వల్ల దహన సంస్కారాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెన్నై హాజరై కార్యక్రమాలు చేసారు. ఆమె తమ్ముడు రమేష్ సినిమా ఇండస్ట్రీ లో డబ్బింగ్ రైటర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో…
జుట్టు సంరక్షణలో చాలా మంది చేసే ఒక చిన్న పని — దువ్వడం. అయితే ఇది చిన్న విషయం అనిపించినా,…
వైశాఖ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కాలంగా భావించబడుతుంది. ఈ మాసంలో చేసే పూజలు, దానధర్మాలు విశేష ఫలితాలను…
భారత క్రికెట్‌లో ఒకప్పుడు పెద్ద వివాదంగా నిలిచిన చెంపదెబ్బ ఘటన మరోసారి వార్తల్లోకి వచ్చింది. మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తాజాగా…
పూజ, జపం, ధ్యానం ఇవి భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక ఆచారాలు. రోజువారీ జీవితంలో ఒత్తిడి, ఆందోళన…
డెన్మార్క్‌లో జరుగుతున్న ఉబెర్ కప్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు తన ఆటతో పాటు మరో కారణంతో కూడా…