Manchu Lakshmi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి బాసు వేర్ ఇస్ ద పార్టీ అనే సాంగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ పాట విడుదలైన మరు క్షణం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అత్యధిక వ్యూస్ రాబట్టింది.ఇకపోతే ఈ సినిమాలోని ఈ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతుండడంతో ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ పాటకు డాన్సులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి కూడా బాసు వేర్ ఇస్ ద పార్టీ అంటూ అద్భుతమైన స్టెప్పులతో రెచ్చిపోయే డాన్స్ చేశారు.
ఇక ఈ పాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో మంచు లక్ష్మితో పాటు రంగస్థలం మహేష్ కూడా డాన్స్ చేశారు.ఇక ఈ వీడియోని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అప్పుడప్పుడు తనకు మెగాస్టార్ చిరంజీవి గారి పాటలకు డాన్స్ వేయడం చాలా సరదాగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే చిరంజీవికి పోటీగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా కూడా విడుదల కావడంతో ఈ రెండు సినిమాల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. మరి ఈ సంక్రాంతి ఎవరికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాల్సి ఉంది.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…