Manchu Lakshmi:సినిమా ఇండస్ట్రీలోకి మంచు వారసురాలిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలు, టాక్ షోలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి మంచు లక్ష్మి గురించి చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందడం కోసం ఈమె అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి మంచు లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఆర్జె కాజల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో భాగంగా మంచు లక్ష్మీ నటిస్తున్న లేచింది మహిళలోకం అనే సినిమాకు సంబంధించి ఓ ప్రశ్న అడిగారు. ఈ సందర్భంగా కాజల్ మంచు లక్ష్మిని ప్రశ్నిస్తూ..సెల్బియన్ సె*క్స్, ఆడవాళ్లకు సంబంధించిన మెసేజ్ గురించి ప్రశ్నించింది.ఈ సినిమాలో ఇలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని ప్రశ్నించగా మంచు లక్ష్మి ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా మంచు లక్ష్మీ సమాధానం చెబుతూ….లెస్బియన్ ప్రేమలో తప్పేముంది? నాకు గే పీపుల్, లెస్బియన్ విషయంలో ఏ విధమైనటువంటి తప్పుడు అభిప్రాయం లేదని అలాగే మన పురాణాలలో ఉన్నటువంటి శిఖండి ఎవరు? బృహన్నల ఎవరు? ఒక మహిళ, ఒక వ్యక్తి, వాళ్లు ఒక మహిళ లేదా వ్యక్తితో ఉండాలని నిర్ణయించడానికి మనం ఎవరు? అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం అయినా వాళ్ళు రొమాన్స్ చేసుకుంటే తప్పు లేదని ఈమె ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక తన గురించి వచ్చే ట్రోల్స్ పై కూడా ఈ సందర్భంగా మంచు లక్ష్మి స్పందించారు.తాను ఒక ఆర్టిస్ట్ తనని చూసి పదిమంది నవ్వుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అయితే ఇలా నా గురించి ట్రోల్స్ చేస్తూ నవ్వుకోకపోతే తాను ఒక ఆర్టిస్ట్ గా ఫెయిల్ అయినట్టేనని ఈమె సమాధానం చెప్పారు. తన గురించి వచ్చే ట్రోల్స్ చూస్తూ తాను ఎంజాయ్ చేస్తుంటానని ఈ సందర్భంగా ఈమె క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…