Manchu Manoj: మంచు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో మనోజ్ ఒకరు.ఈయన కూడా ఇండస్ట్రీలో పలు హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ మధ్యకాలంలో మనోజ్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సినిమాలకు దూరంగా ఉన్నారని త్వరలోనే ఈయన కొత్త సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని వెల్లడించారు.
కడపలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అమీర్ పీన్ దర్గా గురించి అందరికీ తెలిసిందే.ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ దర్గాను దర్శించడం కోసం ఎంతోమంది సీనియర్ రాజకీయ సెలబ్రిటీలు కడపకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ సైతం శుక్రవారం కడప దర్గాను దర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి దర్గాను దర్శించుకోవాలని అనుకున్నాను ఎట్టకేలకు నా కల నెరవేరిందని తెలిపారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉందని మనోజ్ వెల్లడించారు. ఇక తన కెరీర్ గురించి కూడా ఈ సందర్భంగా మనోజ్ పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే తను కొత్త ప్రాజెక్ట్స్ కొత్త సినిమాలను ప్రకటించబోతున్నానని తెలిపారు. అదేవిధంగా త్వరలోనే తాను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని , త్వరలోనే కుటుంబంతో కలిసి మరోసారి కడప దర్గాను దర్శించుకుంటామని మనోజ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక మనోజ్ భూమా మౌనిక రెడ్డినీ పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇది జీవితానికి సంబంధించిన విషయం మంచి రోజు చూసుకొని చెబుతానని గతంలో చెప్పారు. ఈ క్రమంలోనే ఈయన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అర్థమవుతుంది.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…