Sri satya: బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం మరి రెండు రోజులలో ముగియనుంది. ఈ క్రమంలోనే హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉండడంతో ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి ఆరుగురు కంటెస్టెంట్లలో శ్రీ సత్య ఎలిమినేట్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
టాప్ ఫైవ్ లో ఉంటానని భావించిన శ్రీ సత్య ఎలిమినేషన్ ఆమెకు కూడా ఎంతో షాకింగ్ గా ఉందని చెప్పాలి. బిగ్ బాస్ మొదట్లో ఏ విధమైనటువంటి టాస్కులలో పర్ఫామెన్స్ చేయకుండా ఏదో సరదాగా గడపడానికి వచ్చినట్లు వ్యవహరించిన శ్రీ సత్య మొదటి నాలుగైదు వారాలలోనే ఎలిమినేట్ అవుతుందని భావించారు.
ఇలా ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఉండనట్లు ఉండడంతో నాగార్జున సైతం తనకు క్లాస్ పీకారు అప్పటినుంచి ప్రతి ఒక్క టాస్క్ లోను కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తూ 15వ వారం వరకు హౌస్ లో కొనసాగింది.ఇక 15వ వారంలో కూడా ఈమె టాప్ ఫైవ్ లో ఉంటానని భావించినప్పటికీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చారు.
ఇలా 15 వారాలపాటు హౌస్ లో కొనసాగిన శ్రీ సత్య బయటకు వచ్చిన అనంతరం ఈమె బిగ్ బాస్ నుంచి ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం శ్రీ సత్య బిగ్ బాస్ ద్వారా ఏకంగా 15 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.ఈమె హౌస్ లోకి వెళ్లేముందే వారానికి లక్ష రూపాయలు చొప్పున అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. 15 లక్షల రూపాయలు అంటే శ్రీ సత్య బిగ్ బాస్ నుంచి మంచి రెమ్యూనరేషన్ అందుకుందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…