Prakash Raj: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పఠాన్. ఈ సినిమా జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన దీపికా పదుకొనే నటించారు.చాలా సంవత్సరాలు తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా జనవరి 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా భేషరమ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో దీపిక పదుకొనే భారీగా ఎక్స్పోజ్ చేయడంతో ఈమె వస్త్రధారణ పట్ల ఎంతోమంది విమర్శలు చేశారు. దీంతో ఈ పాట కాస్త వివాదంలో చిక్కుకుంది.
ఇప్పటికే పలువురుసినీ రాజకీయ ప్రముఖులు ఈ పాటపై విమర్శలు కురిపించారు. తాజాగా మధ్యప్రదేశ్ మంత్రి చిత్ర బృందానికి వార్నింగ్ ఇస్తూ.. డర్టీ మైండ్ సెట్ తో ఈ పాటను చిత్రీకరించారని తప్పులు సరిద్దుకోకపోతే సినిమాను విడుదల చేయనివ్వం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈ వివాదంలోకి నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ ఇష్యూ పై స్పందించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ప్రకాష్ రాజు మాట్లాడుతూ బ్రోకర్ ఎమ్మెల్యేలు కాషాయపు ముసుగులో స్వామీజీలు మైనర్ బాలికల పై అత్యాచారాలు చేసిన వివాదాలు ఉండవు. అలాంటివారు పబ్లిక్ లో తిరిగినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ దీపికా పదుకొనే ధరించిన కాస్ట్యూమ్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయా అంటూ ప్రశ్నిస్తూ ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోని ఈయన చేసిన ఈ కామెంట్స్ సినీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…