Movie News

Manchu Manoj: దేవుడికి వినాయకుడు దొరికినట్లు నాకు బాబు దొరికాడు … మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?

Manchu Manoj: గత కొంతకాలంగా మంచు కుటుంబం తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇటీవల మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మా ఇండస్ట్రీకి చెందిన మంచూ మనోజ్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడంతో వీరి పెళ్లి వార్తా వైరల్ గా మారింది . గత కొంతకాలంగా ప్రేమించుకున్న వీరిద్దరూ ఇటీవల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే వీరిద్దరికి ఇది రెండవ వివాహం.

ఇద్దరూ కూడా తమ మొదటి వివాహాన్ని రద్దు చేసుకొని తాజాగా ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
వివాహం తర్వాత మొదటిసారిగా మనోజ్ మౌనిక ఇద్దరూ కలిసి వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది షోకి హాజరయ్యారు. ఈ షోలో మనోజ్ మౌనిక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరికి ఇష్టం ఉందనే విషయం మొదట ఎవరికి అనిపించింది?ఎవరు చెప్పారు? అని వెన్నెల కిషోర్ ప్రశ్నించగా.. మనోజ్ స్పందిస్తూ తానే మొదట ప్రపోజ్ చేశానని తెలిపాడు.

మౌనిక పడిన కష్టాలు చూసిన తర్వాత నా బాధలు చాలా చిన్నవి అనిపించాయి. అప్పుడు నువ్వేంటే ఇష్టం, నువ్వు ఒప్పుకొంటే నిన్ను, బాబుని నా జీవితంలోకి ఆహ్వానిస్తా అని చెప్పాను అంటూ మంచు మనోజ్ తెలిపాడు. అప్పుడు మౌనిక సరిగానే ఆలోచించి చెప్పావా? ఈ సొసైటీ గురించి, ఇంట్లో వల్ల గురించి ఆలోచించావా? అని ప్రశ్నించింది . అవన్నీ నేను పట్టించుకోను… ఇంట్లో వాళ్ళని ఒప్పించటం అది నా సమస్య..అవన్నీ నేను చూసుకుంటాను అని చెబితే మౌనిక ఒప్పుకుంది అంటూ మనోజ్ తెలిపాడు.

Manchu Manoj: వనవాసం చేసాము…


మౌనిక నా ప్రపోజల్ కి ఒప్పుకోవడంతో శివుడికి వినాయకుడు దొరికినట్లు నాకు బాబు దొరికాడు. ఆ తర్వాతే మా వనవాసం మొదలైంది అంటూ మనోజ్ తెలిపాడు . ఆ తర్వాత ఇక్కడే ఉంటే మాకు ప్రమాదమని తెలిసి దేశాలు తిరుగు వనవాసం చేసాము అంటూ తమ ప్రేమ, పెళ్ళి గురించి మనోజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

9 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

12 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

12 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

13 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

14 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

15 hours ago