Manchu Vishnu: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాలలో మంచు కుటుంబం ఒకటి.మంచు మోహన్ బాబు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విపరీతమైన ఆధారాభిమానాలు సొంతం చేసుకున్నారు. అయితే మంచు మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విష్ణు మంచు లక్ష్మి ప్రసన్న ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి.
ఇకపోతే మంచు కుటుంబం తరచూ ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.అయితే ఈ విషయంపై ఎన్నోసార్లు మంచు ఫ్యామిలీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ గురించి ఎవరైతే నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారో వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇలా వారి గురించి నెగటివ్ కామెంట్లు చేసేలా పోస్టులు వాళ్లే పెడుతున్నారనే విషయాన్ని మంచు ఫ్యామిలీ గుర్తించలేకపోతోంది.
ఇలా ఎన్నోసార్లు మీడియా ఎదుట నోరు జారిన మంచు విష్ణు మరోసారి జిన్నా సినిమా విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలోనే ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మంచు విష్ణు పై నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఈ సందర్భంగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తాను నటించిన సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
మంచు విష్ణు నటించిన డైనమైట్’ సినిమాకి అయితే నార్త్ లో అత్యధిక టిఆర్పీ లు సాధించిన సినిమాల్లో టాప్ 3 ప్లేస్ ను దక్కించుకుందని’, అలాంటి సినిమా తెలుగులో వచ్చిన లేదా జిన్నా లాంటి సినిమా హిందీలో రిలీజ్ చేసిన వందల కోట్లు కలెక్షన్లు రాబట్టేవి అంటూ విష్ణు కామెంట్స్ చేశారు.ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి నేటిజన్ లు తీవ్రస్థాయిలో మంచు విష్ణు పై ట్రోల్ చేస్తున్నారు.జిన్నా సినిమా కోటి రూపాయల కలెక్షన్లకు నానా తిప్పలు పడుతున్నారు. అలాంటిది వంద కోట్ల కలెక్షన్లు రాబట్టడం అంటే ఎంత కష్టమో చెప్పాల్సిన పనిలేదు. మరి మా ప్రెసిడెంట్ గారికి ఈ విషయంపై అవగాహన లేదా? అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…