Categories: FeaturedMovie News

Manjula: కృష్ణ ఇందిరా దేవి పెళ్లి రోజును గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన మంజుల.. పోస్ట్ వైరల్!

Manjula: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యల కారణంగా ఈ నెల 15వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణించి దాదాపు పది రోజులుగా కావస్తున్నప్పటికీ ఇంకా ఇతని మరణ వార్త నుంచి అభిమానులు మహేష్ బాబు కుటుంబ సభ్యులకు కోలుకోలేకపోతున్నారు.ఇక మహేష్ బాబు కొడుకుగా తన తండ్రికి నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు అన్నింటిని కూడా పూర్తి చేస్తున్నారు.

ఇక కృష్ణ మొదటిసారిగా ఇందిరా దేవినీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా కృష్ణ ఇందిరా దేవికి ఐదుగురు సంతానం. ఇక కృష్ణ నటి విజయనిర్మలను రెండవ పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ దంపతులకు పిల్లలు లేరు. అయితే కృష్ణ విజయనిర్మలను పెళ్లిచేసుకున్నప్పటికీ ఇందిరా దేవిని కూడా ఎంతో మంచిగా చూసుకున్నారు.ఇకపోతే ఈమె మరణించిన తక్కువ వ్యవధిలోనే కృష్ణ గారు కూడా మరణించడం మహేష్ బాబు కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది.

ఇకపోతే కృష్ణ,ఇందిరా దేవి మరణించిన తర్వాత వారి మొదటి వివాహ వార్షికోత్సవం రావడంతో కృష్ణ కుమార్తె మంజుల ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. కృష్ణ నవంబర్ 15వ తేదీ మరణించారు. అయితే వీరి వివాహ వార్షికోత్సవం నవంబర్ 22వ తేదీ రావడంతో మంజుల తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకున్నారు.

తనని కలవడానికి మమ్మల్ని వదిలి వెళ్లారు…
తమ తల్లిదండ్రుల జీవిత భాగస్వామ్యం స్వర్గంలో జరుగుతుంది. తన తల్లి మరణించిన తర్వాత తండ్రి కృష్ణ గారు ఆమె లేని లోటును భరించారు. బహుశా అందుకేనేమో తనని కలవడానికి చాలా తొందరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు అంటూ ఈ సందర్భంగా మంజుల తన తల్లి తండ్రితో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ పెద్ద ఎత్తున ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago